Medchal Daughter Incident: ప్రియుడి మోజులో తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కూతురు.. ఏడాది తర్వాత బయటపడ్డ దారుణం
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడాది పాటు దర్యాఫ్తు చేశారు. ఈ క్రమంలోనే చిన్న కూతురు ఇషిక, ఆమె భర్తను సైతం పోలీసులు పలుమార్లు విచారించగా కట్టుకథలు చెప్పి తప్పుదోవ పట్టించారు.
Medchal Daughter Incident: మేడ్చల్ జిల్లా కౌకూరులో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో కన్న తల్లిని కిరాతకంగా చంపింది కుమార్తె. ఈ అమానుష ఘటనను ఏడాది తర్వాత పోలీసుల విచారణలో బయటపడింది. గత ఏడాది మే నెలలో తల్లి అంజును చిన్నకూతురు ఇషిక తన ప్రియుడి సాయంతో హత్య చేసింది. ఆపై నేరం నుంచి తప్పించుకోవడానికి డెడ్ బాడీని ఇంట్లోనే పాతిపెట్టింది. తల్లి అంజు కనిపించడం లేదంటూ పెద్ద కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడాది పాటు దర్యాఫ్తు చేశారు. ఈ క్రమంలోనే చిన్న కూతురు ఇషిక, ఆమె భర్తను సైతం పోలీసులు పలుమార్లు విచారించగా కట్టుకథలు చెప్పి తప్పుదోవ పట్టించారు. చివరికి సాంకేతిక ఆధారాలతో నిందితుల బండారాన్ని బట్టబయలు చేశారు పోలీసులు. ఇషిక ఇంట్లో తవ్వకాలు జరిపి అంజు అవశేషాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. నిందితులు ఇషిక, ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ప్రియుడి కోసం కన్న తల్లిని కిరాతకంగా చంపిన నిందితురాలిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
నవ మాసాలు మోసి కని పెంచిన కన్నతల్లిని ప్రియుడితో కలిసి కూతురే చంపి పాతిపెట్టిన వైనం హైదరాబాద్ శివార్లలో సంచలనం సృష్టించింది. ఏడాది తర్వాత తల్లి అంజు మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. 2025 మేలో అదృశ్యమైన అంజు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అంజు కన్నకూతురి చేతిలో దారుణ హత్యకు గురైన విషయం బయటపడింది. ప్రియుడి సాయంతో తల్లిని హత్య చేసిన కూతురు.. అతడి సాయం తీసుకుని తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టింది. లోతైన విచారణలో అసలు నిజం బయటపెట్టారు పోలీసులు. ప్రియుడితో పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో తల్లి అంజుని కూతురు ఇషిక అత్యంత కిరాతకంగా హత మార్చిందని పోలీసులు తెలిపారు.
Also Read: గ్యాస్ సిలిండర్‌పై మరో పిడుగులాంటి వార్త.. కేంద్రం కొత్త నిబంధనలు ఇవే.. ఇవి తప్పనిసరి..
