MBBS Student Suicide For Cat : పిల్లుల కోసం రెండు నిండు జీవితాలు బలి.. డాక్టర్ కావాల్సిన యువతి దారుణం… అసలేం జరిగిందంటే..
MBBS Student Suicide For Cat : పెంపుడు పిల్లులు.. ఇద్దరు యువతులు జీవితాలను బలి తీసుకున్నాయి. ఆ వివరాలు..
in hyderabad mbbs student suicide for pet cat and another one dies at alwal
MBBS Student Suicide For Cat : ఈమధ్య కాలంలో చాలా మంది కుక్కలు, పిల్లులు, రామచిలుకలు వంటి వాటిని పెంచుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మనుషుల మాదిరి మూగజీవులు అవసరానికి తగ్గట్టు ప్రవర్తించవు.. నమ్మకంగా ఉంటాయి. నిజమైన ప్రేమను చాటుతాయి. అందుకే చాలా మంది వీటిని పెంచుకుంటున్నారు. ఇలా పెంచుకుంటున్న జంతువుల మీద అతి ప్రేమ రెండు నిండు జీవితాలను బలి తీసుకుంది. పెంపుడు పిల్లి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఒకరు ఎంబీబీఎస్ స్టూడెంట్ కావడం విశేషం. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది.
పెంపుడు పిల్లుల కోసం వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్ నగరంలో ఇద్దరు యువతులు ప్రాణాలు విడిచారు. అది కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటనల్లో ఒకటి అల్వాల్‌లో వెలుగుచూసింది. ఎంబీబీఎస్ విద్యార్థిని శ్రేష్ట గత కొన్నాళ్లుగా పిల్లిని పెంచుకుంటోంది. అయితే మూడు రోజుల క్రితం పెంపుడు పిల్లి విషయంలో తల్లితో శ్రేష్టకు గొడవయ్యింది. దీంతో పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దని శ్రేష్ట తల్లి ఆమెను మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రేష్ట దారుణ నిర్ణయం తీసుకుంది.
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు విగతజీవిగా ఫ్యాన్‌కు వేలాడుతున్న శ్రేష్ట కనిపించింది. కొద్ది రోజుల్లో డాక్టర్ కావాల్సిన బిడ్డ.. శవమై వేలాడటాన్ని చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పీజీ పరీక్షలకు సిద్ధమవుతూ తన భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న యువతి.. చిన్న విషయానికి ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
పిల్లి చనిపోయిందని ఆత్మహత్య
ఇదిలా ఉండగా గత మూడు రోజుల క్రితం ఇలాంటి ఘటనే మీర్‌పేటలో వెలుగుచూసింది. తాను ఇష్టంగా పెంచుకుంటున్న పిల్లి మరణం తట్టుకోలేక పురుగుల మందు తాగి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హిమబిందు అనే యువతి.. రెండు సంవత్సరాలుగా ఒక పిల్లిని పెంచుకుంటోంది. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ప్రేమగా దానిని చూసుకునేది. ఆ పిల్లి మీద అమితమైన ప్రేమను పెంచుకుంది. అంత ప్రేమగా పెంచుకున్న పిల్లి ఇటీవల మరణించింది. దాని మీద ప్రాణాలు పెట్టుకున్న హిమబిందు పిల్లి చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. దీంతో దారుణ నిర్ణయం తీసుకుంది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
