Jayasudha: బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న జయసుధ.. ఆ రెండు నియోజకవర్గాలపై గురి..

సినీపరిశ్రమలో సహజనటిగా పేరుతెచ్చుకున్న జయసుధ రాజకీయాల్లోనూ రాణించారు. 2009 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చొరవతో జయసుధ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా బరిలోనిలిచి ఆమె విజయం సాధించారు.

Former MLA Jayasudha

Former MLA Jayasudha: సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ (Jayasudha) భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సమక్షంలో ఆమె బుధవారం మధ్యాహ్నం బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటికే జయసుధ ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy), డాక్టర్ లక్ష్మణ్   (Lakshman) ఉన్నారు. వీరితోపాటు తెలంగాణ బీజేపీ (Telangana BJP) కీలక నేతలు ఢిల్లీలో ఉన్నారు. వీరందరి సమక్షంలో జయసుధ బీజేపీలో చేరతారని తెలిసింది. గతంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జయసుధ.. ఇప్పుడు ముషీరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచేందుకు ఆసక్తిచూపుతున్నట్లు సమాచారం.

Kishan Reddy : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్టీ రిజర్వేషన్లు పెంపు : కిషన్ రెడ్డి

తెలంగాణలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర పార్టీలో కీలక మార్పులు చేసింది. అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలను కేంద్ర పార్టీ అధిష్టానం అప్పగించిన విషయం తెలిసిందే. ఫలితంగా పార్టీలో నెలకొన్న అసంతృప్తి, అంతర్గత విభేదాలకు చెక్ పెట్టింది. అంతేకాక, రాష్ట్రంలోని పలు పార్టీల నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జయసుధ చేరిక అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జయసుధ ప్రత్యేకంగా వెళ్లికలిసి అభినందించారు. ఈ సమయంలోనే ఆమె బీజేపీలో చేరికపై చర్చ జరిగినట్లు, ఆ చర్చలు సఫలం కావడంతో బుధవారం జేపీ నడ్డా సమక్షంలో జయసుధ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Kishan Reddy: బీజేపీ గురించి విజయశాంతి చేస్తున్న ట్వీట్లను నేను..: కిషన్ రెడ్డి

సినీపరిశ్రమలో సహజనటిగా పేరుతెచ్చుకున్న జయసుధ రాజకీయాల్లోనూ రాణించారు. 2009 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చొరవతో జయసుధ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా బరిలోనిలిచి ఆమె విజయం సాధించారు. ఆ తరువాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తరువాత రాజకీయాలకు ఆమె కొంతదూరంగా ఉన్నారు. ఆ తరువాత వైసీపీ, టీడీపీల్లోనూ ఆమె కొనసాగారు. అయితే, ఆ పార్టీల్లో ఉన్నప్పటికీ యాక్టివ్ పాలిటిక్స్‌లో జయసుధ కనిపించలేదు.

తాజాగా మళ్లీ ఆమె బీజేపీలో చేరడం ద్వారా రాజకీయ జీవితాన్ని పున:ప్రారంభించేందుకు సిద్ధమైయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఏదో ఒకస్థానం నుంచి ఆమె పోటీలో ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం నుంచి ఆమేరకు హామీసైతం వచ్చినట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.