Jio 5G: తెలంగాణలో 10 నగరాల్లో జియో ట్రూ 5జీ సేవ‌లు

రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను తెలంగాణలో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, రామగుండం, మంచిర్యాలలో రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ప్రారంభించింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ను మినహాయిస్తే మిగతా నగరాల్లో 5జీ సేవలను అందిస్తోన్న ఒకే ఒక టెలికాం నెట్వర్క్ కావడం విశేషం.

Relaince Jio True 5G Service Launches in Haridwar, Now Available in 226 Cities

Jio 5G: రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను తెలంగాణలో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, రామగుండం, మంచిర్యాలలో రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ప్రారంభించింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ను మినహాయిస్తే మిగతా నగరాల్లో 5జీ సేవలను అందిస్తోన్న ఒకే ఒక టెలికాం నెట్వర్క్ కావడం విశేషం. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణలోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.

జియో ట్రూ 5జీ సేవల ప్రారంభంతో తెలంగాణ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొందడమే కాకుండా, ఈ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటీ, ఎస్ఎమ్ఈ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలు పెరుగుతాయని ఆ కంపెనీ చెప్పింది. జియో ట్రూ 5జీ పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది.

తాజాగా జియో తెలంగాణ సీఈవో కేసీరెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణలో జియో ట్రూ 5జీని వేగంగా విస్తరించడం మంచి పరిణామం. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుంది. జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికి ట్రూ-5జీ ప్రయోజనాలను అందించడానికి కృషిచేస్తున్నారు. ఈ గ‌ణ‌నీయ‌మైన మార్పునకు ఉన్న శ‌క్తి, దాని అపార ప్ర‌యోజ‌నాల‌ను మ‌న దేశంలోని ప్ర‌తి పౌరుడు అనుభవించగలడు. తెలంగాణను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అని అన్నారు.

ఈ నగరాల్లో 5G సేవలను పొందాలనుకునే జియో వినియోగదారులకు జియో వెల్కం ఆఫర్ ఆహ్వానం అందుతుంది. దీనిద్వారా వారు అదనపు ఖర్చు లేకుండా 1 జీబీపీఎస్+ వేగంతో అపరిమిత డేటాను పొందవచ్చు.

Google Bard vs ChatGPT: మరింత పెరిగిన పోటీ.. గూగుల్ ఉద్యోగులకు సుందర్ పిచాయ్ కీలక సూచనలు