×
Ad

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠ.. షార్ట్ లిస్ట్‌లో ముగ్గురి పేర్లు..

టికెట్ ఎవరికి ఇచ్చినా మిగతా వ్యక్తులు.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయాల్సిందేనని, అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని బీజేపీ అధినాయకత్వం తేల్చి చెప్పింది.

Jubilee Hills Bypoll: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై బీజేపీ కూడా కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ జాతీయ నేతలు సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ ల తో ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీలో జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆశావహుల షార్ట్ లిస్ట్ తయారు చేసింది బీజేపీ. ఆ షార్ట్ లిస్ట్ లో లంకల దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, వీరపనేని పద్మ పేర్లు ఉన్నట్లు సమాచారం.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 11న ఉపఎన్నిక జరగనుంది. అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. బీజేపీ అభ్యర్థిగా అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి. కాగా, ముగ్గురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురిలో ఒకరిని అధినాయకత్వం ఎన్నుకుని, వారి పేరుని ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. లంకల దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, వీరపనేని పద్మల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ లతో భేటీలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే చర్చించనున్నారు.

ఇప్పటికే అభ్యర్థి ఎంపిక విషయంలో బీఆర్ఎస్ ముందుంది. బీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించడమే కాకుండా ప్రచారం పర్వాన్ని ముమ్మరం చేసింది. అటు కాంగ్రెస్ సైతం తమ అభ్యర్థిని ప్రకటించేసింది. నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చింది. ఇక బీజేపీ జాతీయ అధినాయకత్వం కూడా ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ఫైనల్ చేయనుంది.

టికెట్ ఎవరికి ఇచ్చినా మిగతా వ్యక్తులు.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయాల్సిందేనని, అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని బీజేపీ అధినాయకత్వం తేల్చి చెప్పింది.