×
Ad

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఉత్కంఠకు తెర.. బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్స్ వీరే.. మొత్తం 40 మందితో లిస్ట్..

నామినేషన్ల గడువు ముగియడంతో బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ప్రచార పర్వంలోకి మాజీ సీఎం కేసీఆర్ దిగబోతున్నారు. పార్టీ తరపున ప్రచారం చేయబోతున్నారు. ఆ పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీశ్ రావు ఆ పార్టీ మాజీ మంత్రులు ఉన్నారు. నవంబర్ 9వ తేదీ వరకు పార్టీ నేతలు తమ అభ్యర్థి మాగంటి సునీత తరపున ప్రచారం చేయనున్నారు. ఇవాళ్టితో నామినేషన్ల గడువు ముగియడంతో రేపటి నుంచి బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీఆర్ఎస్ విడుదల చేసింది. మొత్తం 40 మందితో కూడిన లిస్ట్ విడుదల చేయగా.. అందులో మొట్టమొదటి పేరే కేసీఆర్ పేరుంది. ప్రచార పర్వంలో కేసీఆర్ పాల్గొంటారా లేదా అన్న సందేహం నిన్నటివరకు బీఆర్ఎస్ నేతల్లో ఉంది. ఇప్పుడా సందేహాలకు తెరపడినట్లైంది. అయితే, ఏయే తేదీల్లో కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటారు అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార పర్వం తుది అంకంలో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. బీఆర్ఎస్ తన చివరి బహిరంగ సభను భారీగా ఏర్పాటు చేసి అందులో ఒక్క దాంట్లో మాత్రమే కేసీఆర్ పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. దీనిపై రేపటిలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 40 మంది స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, కీలకమైన నేతలు ఉన్నారు. వీరంతా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు.

వచ్చే నెల 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు క్యాంపెయిన్ కు సమయం ఉంది. కాబట్టి ప్రతి ఇంటికి వెళ్లి, ప్రతి ఓటర్ ను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ప్రచార పర్వంలో అన్ని పార్టీల కంటే ముందుంది బీఆర్ఎస్. ముందుగానే ప్రచారాన్ని స్టార్ట్ చేసి ఉధృతం చేసింది. దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతనే తమ అభ్యర్థిగా ప్రకటించింది బీఆర్ఎస్. సెంటిమెంట్ పై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. దాంతో పాటు రెండేళ్ల పాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, అది తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది.

Also Read: జూబ్లీహిల్స్ దంగల్.. ఏకంగా 180 నామినేషన్లు దాఖలు..! బరిలో RRR బాధిత రైతులు..