Jubilee Hills Bypoll: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికను అధికార కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో అభ్యర్థి ఎంపికపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గెలుపు అవకాశాలు ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే తాజాగా బిగ్ అప్ డేట్ వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
ఈరోజు నిర్వహించిన జూమ్ మీటింగ్ లో నవీన్ వైపు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపారట. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేసు నుంచి తాను తప్పుకున్నట్లు ప్రకటించారు బొంతు రామ్మోహన్. జూబ్లీహిల్స్ అభ్యర్థిని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని, ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని ప్రకటించారు బొంతు రామ్మోహన్.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి రేసులో నిన్నటివరకు గట్టి పోటీ ఇచ్చిన బొంతు రామ్మోహన్.. రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. దీంత నవీన్ యాదవ్ కు టికెట్ ఓకే అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.
టికెట్ రేసులో ఉన్న నేతలు ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. సీఎం రేవంత్ ఆధ్యర్యంలో జరిగిన జూమ్ మీటింగ్ లో ఈ అంశానికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ పూర్తిగా నవీన్ యాదవ్ వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. ఇప్పటివరకు బొంతు రామ్మోహన్ పేరు బాగా వినిపించింది. టికెట్ కోసం ఆయన గట్టిగానే ఫైట్ చేశారు.
సడెన్ గా రేసు నుంచి ఆయన విత్ డ్రా అయ్యారు. అభ్యర్థి రేసులో నేను లేను, టికెట్ కూడా అడగటం లేదు, హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా వారి విజయం కోసం కృషి చేస్తానన్నారు. బొంతు రామ్మోహన్ ప్రకటనతో దాదాపుగా నవీన్ యాదవ్ కు లైన్ క్లియర్ అయ్యింది. మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ వైపే మొగ్గుచూపినట్లుగా పార్టీలో ఇంటర్నల్ చర్చ. ఇంఛార్జ్ మంత్రులు కూడా నవీన్ యాదవ్ వైపే మొగ్గుచూపినట్లుగా సమాచారం.
Also Read: కేటీఆర్, హరీశ్ దూకుడు.. కేసీఆర్ ఇచ్చిన టార్గెట్ అదేనా? వీళ్ల దూకుడు ఆపేదెవరు?