JubileeHills Bypoll Results
Jubilee Hills Bypoll Results : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ప్రతీ రౌండ్‌లోనూ తన ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ ప్రదర్శిస్తూ వచ్చారు. దీంతో భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తరువాత పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పిందేంటి? జరిగింది ఏంటి? ఏ ఎగ్జిట్ పోల్ కరెక్ట్ అయింది? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఏ సంస్థ ఏం తేల్చింది?
10టీవీ
కాంగ్రెస్ 46-48 శాతం
బీఆర్ఎస్ 40-42 శాతం
బీజేపీ 8-10 శాతం
స్మార్ట్‌పోల్
కాంగ్రెస్ – 48.2 శాతం
బీఆర్ఎస్ – 42.2 శాతం
బీజేపీ – 7.6 శాతం
హెచ్‌ఎంఆర్
కాంగ్రెస్ – 48.31 శాతం
బీఆర్ఎస్ – 43.18 శాతం
బీజేపీ – 5.84 శాతం
చాణక్య స్ట్రాటజీస్
కాంగ్రెస్ – 46 శాతం
బీఆర్ఎస్ – 43 శాతం
బీజేపీ – 6 శాతం
పబ్లిక్ పల్స్
కాంగ్రెస్ – 48.5 శాతం
బీఆర్ఎస్ – 41.8 శాతం
బీజేపీ – 6.5 శాతం
దాదాపు అన్ని సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ విజయం సాధిస్తారని తేల్చాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చాయి.