Telangana Politics: తెలంగాణ పాలిటిక్స్‌లో హైడ్రామా.. హరీష్ రావు అరెస్ట్.. గన్‌పార్క్ వద్ద జూపల్లి వెయిటింగ్.. తెలంగాణ భవన్‌లో కేటీఆర్..
తెలంగాణ(Telangana Politics)లో అప్పులు, గురుకులాల టెండర్ల వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కాస్తా ఉద్రిక్తతలకు దారితీసింది.
- V Santhosh Kumar
- Published on- July 2, 2026 / 01:48 PM IST
jupally krishna rao and ktr challenges and harish rao arrest at gun park
- గన్‌పార్క్ చర్చ తీవ్ర ఉద్రిక్తత
- బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల సవాళ్లు
- హరీష్ రావు అరెస్ట్
Telangana Politics: తెలంగాణలో అప్పులు, గురుకులాల టెండర్ల వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కాస్తా ఉద్రిక్తతలకు దారితీసింది. బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. అయితే, చర్చకు తాము సిద్ధమంటూ తెలంగాణ భవన్ నుండి గన్‌పార్క్‌కు బయలుదేరిన బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావును, ఇతర నాయకులను పోలీసులు గేటు దాటక ముందే అరెస్ట్ చేశారు.
దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్‌తో చర్చ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత భయమని, ముఖ్యమంత్రి, మంత్రులు మరోసారి సవాల్ నుంచి పారిపోయారని ఆయన ధ్వజమెత్తారు. దమ్ముంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి 30 నెలల కాంగ్రెస్ పాలనలోని దగా, మోసాలు, వైఫల్యాలపై చర్చించాలని డిమాండ్ చేశారు.
Congress Leader: మహిళపై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ నేత జ్ఞానేశ్వర్ అరెస్ట్
అరెస్టులు.. తోపులాటలు: తెలంగాణ భవన్ వద్ద హైడ్రామ:
మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ (Telangana Politics)భవన్‌కు వస్తానని చెప్పి తోక ముడిచారని, అందుకే తాము గన్‌పార్క్ వెళ్తుంటే పోలీసులతో అడ్డుకుని అరెస్టులు చేయించారని కేటీఆర్ ఆరోపించారు. హరీష్ రావుతో పాటు అరెస్ట్ చేసిన నేతలను ఉంచిన కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తామని, అక్కడైనా చర్చించే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కేటీఆర్‌ను కూడా పోలీసులు గేటు వద్దే అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. చేతకాని వాళ్లు సవాళ్లు విసరడం ఎందుకని, రాష్ట్ర ప్రజల ముందు వాస్తవాలు ఉంచే సత్తా ఈ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ కౌంటర్: తాటాకు చప్పుళ్లకు భయపడం:
బీఆర్ఎస్ ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతల గుండాగిరీకి ఎవరూ భయపడే ప్రసక్తే లేదని, వారి తాటాకు చప్పుళ్లను తాము ఖాతరు చేయబోమని స్పష్టం చేశారు. మంత్రులంతా గన్‌పార్క్ వద్ద గంటకు పైగా బీఆర్ఎస్ నేతల కోసమే ఎదురుచూశారని, ఆధారాలు ఉంటే ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. టెండర్ల విలువ కంటే మూడు రెట్లు అవినీతి జరిగిందని అవాస్తవాలు ప్రచారం చేయడం విచిత్రంగా ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇంకా తామే అధికారంలో ఉన్నామనే భ్రమలో బతుకుతున్నారని, ఊరికే ఎన్నికలు అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని, ఇప్పటికే వరుసగా ఓడిపోయిన బుద్ధి రాలేదా అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ వేదికగానైనా వాస్తవాలు ఏంటో తేలుస్తామని పొంగులేటి సవాల్ విసిరారు.
