Ka Paul
Secunderabad: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈనెలలోనే తెలంగాణలోని సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గంలో తాను పాదయాత్ర చేయబోతున్నానని ఇవాళ ప్రకటించారు. ఎవరికైనా దమ్ము ఉంటే తన పాదయాత్రను ఆపండి చూద్దామని సవాలు విసిరారు.
తనతో పాటు సీఎం కేసీఆర్ కూడా పాదయాత్ర చేయాలని సవాలు విసిరారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది సికింద్రాబాద్ నుంచా? ఇతర నియోజక వర్గం నుంచా? అన్నది త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. తన సభకు ప్రజలు చాలా మంది వస్తున్నారని, తాను రూపాయి కూడా ఖర్చు చేయకుండా వాటిని నిర్వహిస్తున్నానని చెప్పారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.. సభలు, సమావేశాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మందు, బిర్యానీ ఆశచూపుతూ జనాలను రప్పిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో కుటుంబ, అవినీతి పాలన పోవాలంటే తనకు ఓటు వేయాలని కోరారు. డిసెంబర్ 6 న తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పారు.
Bihar Caste Survey: కులగణన వెలువడిన వెంటనే బిహార్ బడా నేతలు ఏమన్నారంటే?