Platform Ticket : పండుగ వేళ దక్షిణ మధ్య రైల్వే చార్జీల బాదుడు..ప్లాట్‌ఫాం టికెట్ రేటు డబుల్

సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా.. దక్షిణ మధ్య రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ రేటును పెంచేసింది. ఈ నెల 8 నుంచి 20 తేదీ వరకు పెంచిన రైల్వే ప్లాట్‌ఫాం చార్జీలు వసూలు చేస్తారు.

Platform Ticket : సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా.. దక్షిణ మధ్య రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ రేటును పెంచేసింది. ఈ నెల 8 నుంచి 20 తేదీ వరకు పెంచిన రైల్వే ప్లాట్‌ఫాం చార్జీలు వసూలు చేస్తారు. కాగా ప్రస్తుతం ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.10గా ఉండగా.. దానిని 20 చేసింది దక్షిణమధ్య రైల్వే. ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచినట్లుగా దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్. రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం వచ్చే బంధుమిత్రుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జన సమూహం ప్లాట్‌ఫారంపై ప్రవేశించకుండా నియంత్రించేందుకు చార్జీలను పెంచినట్లు పేర్కొన్నారు. కోవిడ్‌ నియంత్రణ దృష్ట్యా కూడా అనవసరమైన వ్యక్తులు ప్లాట్‌ఫాంలపైకి రాకుండా నియంత్రించాల్సి ఉందన్నారు.

చదవండి : Special Trains : సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ పండుగ కోసం 6,970 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇక టికెట్ ధరను 50 శాతం వరకు పెంచింది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే టికెట్ ధర రూ.350 నుంచి రూ.500వరకు ఉంటుంది. అదే సంక్రాంతి సమయంలో బస్సును బట్టి టికెట్ ధర రూ.750 నుంచి రూ.1100 వరకు ఉంటుంది. ఇక తెలంగాణ ఆర్టీసీ కూడా సంక్రాంతికి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సంక్రాంతికి తెలంగాణలోని వివిధ జిల్లాలకు 3వేల 334 స్పెషల్‌ బస్సులను నడపనుంది. ఇక ఏపీకి మరో 984 సర్వీసులు తిప్పనుంది. పండుగకు ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

చదవండి : Special Trains For Pongal : సంక్రాంతి పండగకి ప్రత్యేక రైళ్లు

 

 

ట్రెండింగ్ వార్తలు