ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయొద్దు.. ప్రభుత్వానికి కడియం సూచన.. క్లారిటీ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి

ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ ను తొలగించొద్దని కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Komatireddy and kadiyam srihari

Telangana Assembly Budget Session 2024 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం కొనసాగాయి. జీరో అవర్ లో పలువురు ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల సమస్యలపై ప్రస్తావించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం యల్కుర్తి గ్రామంలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా అనుమతి ఇవ్వడం జరిగిందని, 2016లో అప్పటి కేంద్ర మంత్రి వద్దకు వెళ్లి అడిగి ఆ స్కూల్ ను తీసుకొచ్చామని అన్నారు. 2017లో అగ్రిమెంట్ కూడా జరిగిందని, 49ఎకరాల 32 కుంటలకు ల్యాండ్ ప్రపోజల్స్ పంపించామని అన్నారు. కానీ, ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో మంజూరు అయిన సైనిక్ స్కూల్ ను తరలించి సికింద్రాబాద్ కంట్రోన్ మెంట్ లో ఏర్పాటు చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసిందని అన్నారు.

Also Read : గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి.. స్కామ్‌లు చేసేవారికే దిమ్మతిరిగే స్కామ్ ఇది

కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే దేశ వ్యాప్తంగా కొత్తగా 100 సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందని, తెలంగాణ ప్రభుత్వం తరపున గట్టిగా పోరాడితే కనీసం మూడు సైనిక్ స్కూళ్లు అయిన రాష్ట్రంకు కేటాయించే అవకాశం ఉంటుందని కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో గతంలో మంజూరు అయిన సైనిక్ స్కూల్ ను తరలించకుండా అక్కడే నిర్మించాలని.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కొత్తగా సైనిక్ స్కూళ్లు రాష్ట్రంకు మంజూరు జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కడియం కోరారు. వర్ధనన్నపేట, స్టేషన్ ఘన్ పూర్ నియోయోజకవర్గాల మధ్య డంపింగ్ యార్డును మరోచోటుకు తరలించాలని కడియం కోరారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ ను తొలగించొద్దని కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Also Read : CAG Audit Report : వెయ్యి కోట్లకు పైగా ప్రజాధ‌నం దుర్వినియోగం..! కాగ్ రిపోర్టులో సంచలనం

మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. 2017లో మంజూరి అయిన సైనిక్ స్కూల్ ఇన్నాళ్లు పూర్తిచేసుకోకుండా ఏం చేశారని ప్రశ్నించారు. తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ కు ఉన్నారు.. బీజేపీతో వాళ్లకు ఎంతో సఖ్యత ఉందని అన్నారు. అయినాసరే, కడియం సూచన మేరకు ఆ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తామని కోమటిరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లోగో కాకతీయ కళాతోరణం, చార్మినార్ విషయంలో రాష్ట్ర క్యాబినెట్, నిపుణుల కమిటీ చర్చించి.. ఏ విధంగా ఉండాలనే విషయాన్ని పరిశీలిస్తున్నామని కోమటిరెడ్డి అన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు