Kaleshwaram Commission Inquiry : కాళేశ్వరం విచారణలో కీలక పరిణామం.. ఆ శాఖ అధికారులకు నోటీసులు..

ఇందులో భాగంగా ఈ సెషన్ లో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగించే కసరత్తు చేస్తోంది.

Kaleshwaram Commission Inquiry : కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుదిదశకు చేరుకుంది. ఇంతవరకు ఇంజినీర్లు, ఉన్నతాధికారులను ప్రశ్నించిన కమిషన్.. తాజాగా పలువురు ఆర్థికశాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. గతంలో వాటర్ రిసోర్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పని చేసిన వి ప్రకాశ్ తో పాటు పలు నిర్మాణ సంస్థలను బహిరంగ విచారణకు పిలిచే అవకాశం ఉంది. మాజీ ఈఎన్సీలను కూడా మరోసారి బహిరంగ విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది.

తుది దశకు రిపోర్ట్..
ఒకవైపు విచారణ ప్రక్రియ కొనసాగుతూనే మరోవైపు విచారణకు సంబంధించిన రిపోర్ట్ ను కమిషన్ తయారు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటివరకు జరిగిన విచారణ రిపోర్ట్ ను కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ ఘోష్ తయారు చేశారు. మార్చి నెలాఖరు వరకు కమిషన్ పూర్తి స్థాయి రిపోర్ట్ ను తయారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఈ సెషన్ లో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగించే కసరత్తు చేస్తోంది.

పనులు పూర్తి కాకుండానే బిల్లుల విడుదల..
ఫైనాన్స్ అండ్ పాలసీ, టెక్నికల్ అంశాలపై విచారణ పూర్తి చేసిన కమిషన్.. నిబంధనలు పాటించకుండా నిధులు విడుదల చేసినట్లు గుర్తించింది. రూల్స్ పాటించకుండా ప్రభుత్వం కాంట్రాక్టర్లను మార్చిందని, పనులు పూర్తి కాకుండానే బిల్లులు విడుదల చేసినట్లు కమిషన్ గుర్తించినట్లు తెలుస్తోంది. రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై సెక్షన్ 70 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Also Read : ఇక నుంచి తెలంగాణ భవన్‌.. తెలంగాణ జనతా గ్యారేజ్‌: కేటీఆర్

నిర్మాణ సంస్థలను విచారించే అవకాశం..
కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో.. కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోశ్ ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. విచారణ తుది దశకు రావడంతో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి? అనేదానిపై డిస్కస్ చేశారు. ఇప్పటివరకు ఇరిగేషన్ అధికారులు, ఈఎన్సీలు, ఐఏఎస్ లను కమిషన్ విచారించింది. మిగిలిన ఐఏఎస్ లను ఫైనల్ విచారించాలని కమిషన్ నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామమైన నిర్మాణ సంస్థలను విచారించాలని కమిషన్ నిర్ణయించింది. ఈ వారం చివరలో వారికి నోటీసులు ఇచ్చి విచారణ పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

మాజీ మంత్రులు ఈటల రాజేందర్(ఆర్థిక శాఖ), హరీశ్ రావులకు(ఇరిగేషన్ శాఖ) కూడా నోటీసులు ఇచ్చి విచారణ పిలిచే అవకాశం అవకాశం ఉందని సమాచారం. పనులు పూర్తి కాకుండానే నిధులు ఎందుకు విడుదల చేశారు? అనే అంశంపై అధికారులు అడిగినప్పుడు ప్రభుత్వం నుంచి జరిగిన ప్రాసెస్ కాబట్టి.. ప్రభుత్వ పెద్దల ఆలోచనల మేరకు ఇదంతా జరిగిందని విచారణలో స్పష్టం చేశారు అధికారులు.

ఈటల రాజేందర్, హరీశ్ రావు, కేసీఆర్ ను విచారించే అవకాశం?
ఆ సమాచారం ఆధారంగా మంత్రులుగా పని చేసిన ఈటల రాజేందర్, హరీశ్ రావులను కూడా విచారించాలని ఆ తర్వాత ఫైనల్ గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించాలని కమిషన్ ఆలోచిస్తోంది. ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ ఉండటం దీనికి కారణం. ఇక, ఆ సమయంలో సీఎం కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్.. అప్పటి సీఎం కేసీఆర్ యే నిర్ణయాలు తీసుకున్నారని, తనదేమీ లేదని ఆమె స్పష్టంగా చెప్పారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా పిలిచి విచారణ చేయాలని పినాకి చంద్ర ఘోశ్ కమిషన్ ఆలోచన చేస్తోంది.

 

Also Read : జ్యూరిచ్ విమానాశ్రయంలో కలుసుకున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ఫొటో వైరల్