Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ పార్టీ మాజీ మహిళా నేత, జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మరోసారి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావుపై మీడియా చిట్‌చాట్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్‌ను అలర్ట్ చేశాను. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్‌కు చెప్పారు. హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్ప నాకు వేరే కోపం లేదని కవిత అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన నాకు లేదు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ నాకు ఫోన్ చేయలేదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఎవర్నీ అప్రోచ్ కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి పదేపదే నాపేరు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నాడేమో..? అంటూ కవిత అన్నారు.
ఒక వర్గం కోసం కాదు.. ప్రజలందరి కోసం పనిచేయాలని అనుకుంటున్నా. బీసీ ఇష్యూ నా మనస్సుకు దగ్గరగా అనిపించింది. ప్రస్తుతం నేను ఫ్రీ బర్డ్. చాలామంది వచ్చి నన్ను కలుస్తున్నారు. నాతో టచ్‌లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దది అని కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కొత్త పార్టీ పెట్టే విషయంపై కవిత ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొత్త పార్టీ పెట్టాలా..? లేదా అనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ పెట్టేముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారు. ప్రస్తుతం నేనూ అదే చేస్తున్నాను. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని నేనే కాబోలు అంటూ కవిత వ్యాఖ్యానించారు.