Kamareddy Master Plan : మాస్టర్ ప్లాన్ మంటలు.. రూ.70 లక్షల నుంచి 20 లక్షలకు పడిపోయిన భూమి ధర.. రైతు ఆత్మహత్యాయత్నం

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తో భూమి ధర పడిపోయిందనే ఆవేదనతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లికి చెందిన రైతు బాలకృష్ణ పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నం చేశాడు. మాస్టర్ ప్లాన్ లో బాలకృష్ణ భూమి గ్రీన్ జోన్ పరిధిలోకి వెళ్లింది.

Kamareddy Master Plan : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తో భూమి ధర పడిపోయిందనే ఆవేదనతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లికి చెందిన రైతు బాలకృష్ణ పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నం చేశాడు. మాస్టర్ ప్లాన్ లో బాలకృష్ణ భూమి గ్రీన్ జోన్ పరిధిలోకి వెళ్లింది.

దీంతో గతంలో 70లక్షల రూపాయలు పలికిన భూమి ధర ఏకంగా రూ.20లక్షలకు పడిపోయింది. భూమిని అమ్మి పిల్లలను చదివించాలనుకున్న బాలకృష్ణ కలవరం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు. బంధువులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ మంటలు రేపింది. మాస్టర్ ప్లాన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి, జగిత్యాలలో రైతు ఉద్యమాలు తీవ్రతరం అవుతున్నాయి. మాస్టర్ ప్లాన్ రద్దు ఒక్కటే అజెండాగా కామారెడ్డిలో రైతులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. 19వ తేదీలోగా రాజీనామాలు చేయాలని కౌన్సిలర్లను హెచ్చరించారు.

Also Read..Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‪పై హైకోర్టులో విచారణ

ఒకవైపు రైతులు సమావేశమై యాక్షన్ ప్లాన్ పై చర్చిస్తుంటే.. మాస్టర్ ప్లాన్ వల్ల భూమి ధర పడిపోతుందనే ఆవేదనతో రామేశ్వర్ పల్లికి చెందిన రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. పరుగుల మందు తాగి బలవనర్మణానికి ప్రయత్నించాడు. బాలకృష్ణను బంధువులు ఆసుపత్రికి తరలించారు. అతడు ప్రస్తుతం కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గతంలోనూ ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు మాస్టర్ ప్లాన్ పట్ల రైతుల్లో ఇంత వ్యతిరేకత వ్యక్తమవడానికి కారణాలు అన్వేషిస్తే.. అనేక మానవీయ కోణాలు వెలుగుచూస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ తో ఒక్కసారిగా రైతుల జీవితాలు తారుమారయ్యాయి. మాస్టర్ ప్లాన్ ప్రకటించక ముందు వరకు కామారెడ్డిలో ఎకరా కోటి రూపాయలు విలువ చేసిన భూముల ధరలు అమాంతంగా పడిపోయాయి. భూముల ధర పడిపోవడం, మాస్టర్ ప్లాన్ వల్ల భూములు కోల్పోవలసి రావడంతో రైతులు కలవరానికి గురవుతున్నారు. ఇవాళ ఆత్మహత్యాయత్నం చేసిన బాలకృష్ణ కుటుంబం కూడా మాస్టర్ ప్లాన్ వల్ల తీవ్రంగా ప్రభావితమైంది.

Also Read..Kamareddy Collector Explanation : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కలెక్టర్ వివరణ.. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే

రైతు బాలకృష్ణకు కామారెడ్డిలో ఎకరా భూమి ఉంది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న బాలకృష్ణ కుమార్తెలను మెడికల్ కోర్సు చదివించాలని అనుకున్నాడు. తన భూమి అమ్మితే రూ.70లక్షలు వస్తాయని, ఆ డబ్బుతో వారిని చదివించి ప్రయోజకులను చేయాలనుకున్నాడు. అయితే, ఆ భూమి ఇప్పుడు మాస్టర్ ప్లాన్ గ్రీన్ జోన్ లోకి వెళ్లిపోయింది. గ్రీన్ జోన్ వల్ల బాలకృష్ణ భూమి ధర అమాంతం పడిపోయింది. రూ.70లక్షలు పలికిన ఆ భూమి ధర ఇప్పుడు రూ.20లక్షలకు అడుగుతున్నారు.

గత నెల రోజుల నుంచి రైతుల ఉద్యమంలో పాల్గొంటున్న బాలకృష్ణ.. భూమి ధర తగ్గించి అడుగుతుండటంతో తట్టుకోలేపోయాడు. తీవ్ర ఆవేదన చెందిన అతడు.. ఇవాళ రైతుల యాక్షన్ ప్లాన్ సమావేశం జరుగుతుండగా ఇంటికి వచ్చి పురుగుల మందు తాగేశాడు. బాలకృష్ణ ఒక్కడే కాదు ఇలా చాలామంది రైతులు భూములు కోల్పోవడం వల్ల, విలువ తగ్గిపోయినందుకు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రైతుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలనే డిమాండ్ రోజురోజుకు తీవ్రమవుతోంది. అటు జగిత్యాలలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రైతుల ఆందోళనలతో జగిత్యాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు నిరసనలతో జగిత్యాల పట్టణం అట్టుడుకుతోంది. మాస్టర్ ప్లాన్ రద్దు డిమాండ్ తో జగిత్యాలలోనూ రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ రోడ్ లో నాలుగు గ్రామాల రైతులు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు.