Kamareddy Collector Explanation : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కలెక్టర్ వివరణ.. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ వివరణ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ పై అందరి అభ్యంతరాలు తీసుకుంటామని చెప్పారు. కొందరు అభ్యంతరాలు ఇచ్చారు.. వారికి సమాధానం ఇస్తున్నామని తెలిపారు.

Kamareddy Collector Explanation : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కలెక్టర్ వివరణ.. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే

KAMAREDDY

Kamareddy Collector Explanation : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై తీవ్ర దుమారం రేగుతోంది. మాస్టర్ ప్లాన్ ను కామారెడ్డి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన, పోరాటాలు చేస్తున్నారు. ఇప్పటికే రైతులు కలెక్టరేట్ ను ముట్టడించి, కార్యాలయంలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. మాస్టర్ ప్లాన్ ను ఉససంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ వివరణ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ పై అందరి అభ్యంతరాలు తీసుకుంటామని చెప్పారు. కొందరు అభ్యంతరాలు ఇచ్చారు.. వారికి సమాధానం ఇస్తున్నామని తెలిపారు.

ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని పేర్కొన్నారు. అభ్యంతరాల స్వీకరణకు 60 రోజుల సమయం ఉందన్నారు. రైతుల అభ్యర్థనను నమోదు చేసుకుంటున్నామని వెల్లడించారు. రైతుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ముసాయిదాలో మార్పులు, చేర్పులు జరుగుతాయన్నారు. అందరి భూములు పోతాయన్నది అపోహ మాత్రమే స్పష్టం చేశారు.  రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. రైతుల భూములు ఎక్కడికీ పోవని స్పష్టం చేశారు.

BJP Bandi Sanjay Arrest : కామారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడించిన బీజేపీ నేతలు.. బండి సంజయ్ అరెస్టు, 11 సెక్షన్ల కింద కేసు నమోదు

ముసాయిదా మాస్టర్ ప్లాన్ మాత్రమే ఇచ్చామని తెలిపారు. ఇంకా మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందలేదని పేర్కొన్నారు. ముసాయిదా మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలుంటే లిఖిత పూర్వకంగా ఇవ్వాలని సూచించారు. రైతులను కొంతమంది తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. రైతులతో చర్చించేందుకు తాను అందుబాటులో ఉంటానని వెల్లడించారు. అయితే 10 మంది రైతులు వచ్చి కలిసేందుకు తనకు ఎలాంటా అభ్యంతరం లేదన్నారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు.

అంతకముందు కామారెడ్డి రైతుల ఆందోళనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ ఇంకా డ్రాఫ్ట్ దశలోనే ఉందన్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు మున్సిపల్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలన్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టి అభివృద్ధి పనులు చేయాలనుకోవడం లేదని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు.

Kamareddy Collectorate High Tension : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద హైటెన్షన్.. గేటు తాళం పగలగొట్టి కార్యాలయంలోకి దూసుకెళ్లిన రైతులు
మాస్టర్ ప్లాన్ పై కామారెడ్డి రైతులు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వర్ పల్లి రైతులు కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. మాస్టర్ ప్లాన్ పై రైతులు తమ తమ అభ్యంతరాలను పిటిషన్ లో ప్రస్తావించారు. తమను సంప్రదించకుండా భూములను రీక్రియేషన్ జోన్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు కూడా సిద్ధమని రైతులు స్పష్టం చేశారు. కామారెడ్డి రైతులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై సోమవారం హైకోర్టు విచారణ జరుపనుంది.