Kaushik Reddy Arrest
Kaushik Reddy Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని మంగళవారం ఉదయం పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఈ సందర్భంగా కరీంనగర్ కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షల అనంతరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ నుంచి భారీ భద్రత మధ్య కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ వద్దకు తరలించారు.
Also Read: Kaushik Reddy Arrest: రాత్రంతా పోలీస్ స్టేషన్‌లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడతామని చెప్పారు. పండుగ వేళ అరెస్టు చేసి ఇంట్లో లేకుండా చేశారని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కు తగ్గనని.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తూనే ఉంటానని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో కరీంనగర్ లో హైటెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టకుండా పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టును కేటీఆర్, హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో వారు కరీంనగర్ వెళ్లే సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు వారిని నిర్భందించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో కేటీఆర్, కోకాపేటలో హరీశ్ రావును గృహనిర్బంధం చేశారు. వారి నివాసాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కరీంనగర్ లోని బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద పోలీసులను మోహరించారు. కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కరీంనగర్ వ్యాప్తంగా పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు
ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ప్రజల పక్షాన మీ అక్రమాలపై పోరాటం ఆగదు ❗️ pic.twitter.com/bOoSyhYXPq
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) January 14, 2025