Fake Screaming Snake : అరుస్తున్న వింత పాము ఫేక్ వీడియో-కరీంనగర్ పోలీసులు

కరీంనగర్‌ జిల్లాలో కూత పెడుతున్న వింత పాము పేరుతో నిన్న వైరల్ అయిన వీడియోను తయారు చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Karimnagar Police Warning To Screaming Snake Fake Video Creator

Fake Screaming Snake  : కరీంనగర్‌ జిల్లాలో కూత పెడుతున్న వింత పాము పేరుతో నిన్న వైరల్ అయిన వీడియోను తయారు చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో నీలగిరి చెట్ల మధ్య స్థానికులు ఈ పామును గుర్తించినట్లు… ఈ పాము నోరు తెరిస్తే వింతగా శబ్దాలు వస్తున్నట్లు చెపుతూ వీడియో ఒకటి సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అలర్టైన పోలీసులు ఆవీడియో గురించి ఎంక్వైరీ చేయగా ఫేక్ వీడియో అని తేలింది. పామును  చూశానని చెపుతున్న కరీంనగర్, ఇందిరానగర్ కాలనీలో ఉండే యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్ధానికంగా ఉన్న కుర్రాళ్లు క్రికెట్ పేరుతో గోల చేస్తూ ఉండటంతో వారి గోల తట్టుకోలేక వారిని భయపెట్టాలని ఈ వీడియో రూపోందించినట్లు వీడియో తయారు చేసిన యువకుడు ఒప్పుకున్నాడు.

షేర్ చాట్ లోంచి వీడియో డౌన్లోడు చేసుకుని దానిని రూపోందించినట్లు తెలిపాడు. యువకుడు చేసిన మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్నామని , మరోసారి ఇలాంటి పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆ యువకుడిని హెచ్చరించి పంపించారు.

కాగా … ఇదే వీడియో నెల రోజుల క్రితం Mike Martin అనే యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ అయినట్లు తెలిసింది. అదే వీడియోను ఈ అకతాయి డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు కొందరు చెపుతున్నారు.