CM Siddaramaiah : కామారెడ్డిలో కర్ణాటక సీఎం .. కేసీఆర్‌పై విమర్శలు

కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విజయం సాధించటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ అవినీతి పాలతో వెనకేసిన డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు అంటూ విమర్శించారు.

Congress BC Declaration Meeting at Kamareddy

Congress BC Declaration Meeting at Kamareddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది.బీఆర్ఎస్ పాలన అంతం చేయాలని పిలుపునిస్తోంది. దీని కోసం ఢిల్లీ అగ్రనేతలు సైతం తెలంగాణలో ప్రచారాలు నిర్వహించారు. సభలు, సమావేశాలతో బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్ కుటుంబ పాలన అంటూ విమర్శలు సంధించారు. ఈ క్రమంలో ఈరోజు కామారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య హాజరయ్యారు. ఈ సభలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది.

ఈరోజు కామారెడ్డిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలో టీ.కాంగ్రెస్ అగ్రనేతలు సైతం హాజరయ్యారు. ఈ సభకు హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య  సీఎం కేసీఆర్ పాలనపై విమర్శలు సంధించారు. తెలుగులో స్పీచ్ ప్రారంభించి..అందరికి నా నమస్కారాలు అంటూ సభలో ఉత్సాహాన్ని నింపారు. కేసీఆర్ పాలనపై విమర్శలు చేశారు. పదేళ్ల పాలనలో భారీ అవినీతికి పాల్పడ్డారు అంటూ ఆరోపించారు. కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విజయం సాధించటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ అవినీతి పాలతో వెనకేసిన డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు అంటూ విమర్శించారు.

Chegondi Harirama Jogaiah : టీడీపీ,జనసేన కూటమిలో బీజేపీ : హరిరామ జోగయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

తాము అధికారంలోకి వస్తే..జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు..ప్రతీ మండలానికి ఒక బీసీ గురుకులం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బీసీ సబ్ ప్లాన్ ను ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.10లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. 50 ఏళ్లు దాటిన నేత కార్మికులకు పెన్షన్ అందిస్తామని..బీసీ-డీలో ఉణ్న ముదిరాజ్ లను బీసీ -ఏలో చేరుస్తామన్నారు. తెలంగాణలో మూడు చోట్ల మెగా పవన్ లూమ్ కస్టర్లను ఏర్పాటు చేస్తామని హామీలిచ్చారు.