Telangana Politics: కర్ణాటకలో జరిగిందే మహారాష్ట్రలో రిపీట్ అవుతుంది.. సిద్ధిపేట సభలో బీజేపీ అగ్రనేత మురళీధర్ రావు

మోదీ ప్రభుత్వం వచ్చిన 9ఎండ్లలో ప్రజలకు ఎం చేశారో ప్రతి ఇంటికి వెళ్ళి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అవగాహన కల్పిస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా లక్షల కోట్ల అవినీతి జరిగింది. మోదీ తొమ్మిది ఎండ్ల ప్రభుత్వంలో నీతి నిజాయతీతో కూడిన పరిపాలన అందిస్తున్నారు

Siddipeta: బీఆర్ఎస్ పార్టీ అని పెట్టి కర్ణాటక ఎన్నికల్లో ఏదో చేస్తానంటూ బీరాలు పలికిన కేసీఆర్.. చివరికి కర్ణాటక ఎన్నికల బరిలోకి కూడా పోలేదని, ఇప్పుడు మహారాష్ట్రలో ఏదో చేస్తానని చేస్తున్న హడావుడి కూడా అలాంటిదేనని భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళిధర్ రావు విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

K Laxman: బీజేపీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో కీలక నిర్ణయాలు.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పుపై..

ఈ విషయమై మురళీధర్ రావు మాట్లాడుతూ ‘‘రాబోయే రోజుల్లో పెరిగే పార్టీ బీజేపీ.. కరిగే, అరిగే పార్టీలు మిగతావి. బీజేపీ మీద ఇంద్ర దేవుని ఆశీర్వాదం, అనుగ్రహం ఉంది. తెరాసను బీఆర్ఎస్ పార్టీగా మార్చి పార్టీ పెంచుతా అని కర్ణాటక పోయిన కేసీఆర్ ఏమీ చేయలేదు. కర్ణాటక తరహాలో బీఆర్ఎస్ డబ్బా మహారాష్ట్ర ఎన్నికల్లో సినిమా ముగుస్తుంది. బీజేపీ ముందు బీఆర్ఎస్ ఉనికి లేదు. కేవలం పేపర్లలోనే ఉంది’’ అని అన్నారు.

Indian Railway: రైల్వేలో తరుచూ ప్రయాణం చేస్తుంటారు.. అయినా చాలా మందికి ఈ విషయం తెలియదు

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మోదీ ప్రభుత్వం వచ్చిన 9ఎండ్లలో ప్రజలకు ఎం చేశారో ప్రతి ఇంటికి వెళ్ళి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అవగాహన కల్పిస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా లక్షల కోట్ల అవినీతి జరిగింది. మోదీ తొమ్మిది ఎండ్ల ప్రభుత్వంలో నీతి నిజాయతీతో కూడిన పరిపాలన అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పైసా ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారుల అకౌంట్‭లో చేరుతుంది. మోదీ హయాంలో వేగంగా రహదారుల విస్తరణ చేపట్టారు. ఎక్కడ చూసినా రోడ్డు లేని గ్రామం లేదు’’ అని అన్నారు.

Kazipet Wagon Production : కాజీపేటలో వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో సంపదలు అన్నీ మాయమవుతన్నాయని మురళీధర్ రావు అన్నారు. కరీంనగర్ ప్రాంతంలో ఉండే గుట్టలు, వాగులు అన్ని మాయం అవుతున్నాయని, హైదరాబాద్‮‭లోని చెరువులు కుంటలు మాయం అవుతున్నాయని విమర్శించారు. ఇక 2014లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 20 సీట్లు గెలిచి వారంతా బీఆర్ఎస్ పార్టీలో చేరారని, మళ్లీ ఓట్లేసినా అదే జరుగుతుందని మురళీధర్ రావు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు