Indian Railway: రైల్వేలో తరుచూ ప్రయాణం చేస్తుంటారు.. అయినా చాలా మందికి ఈ విషయం తెలియదు

మీ ప్రయాణ సమయంలో ఒకవేళ రైల్వే స్టేషన్‌లో ఉండవలసి వస్తే, మీకు స్టేషన్‌లోనే గది లభిస్తుంది. దీని కోసం మీరు బయట హోటల్‌కు వెళ్లి గదికి డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీకు రైల్వే స్టేషన్‌లో చాలా తక్కువ గదులు లభిస్తాయి

Indian Railway: రైల్వేలో తరుచూ ప్రయాణం చేస్తుంటారు.. అయినా చాలా మందికి ఈ విషయం తెలియదు

Indian Railway: రైలు ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది. ప్రయాణీకులకు భారతీయ రైల్వే అనేక సౌకర్యాలను అందిస్తుంది. పండుగలు, వేసవి సెలవుల సమయంలో రద్దీతో పాటు సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే దీనితో పాటు ఇతర సౌకర్యాలు కూడా భారతీయ రైల్వే కల్పిస్తోంది. రైల్వే స్టేషన్‌లో బస చేసే సౌకర్యం ఇందులో ఒకటి. కేవలం 100 రూపాయలకే హోటల్ గది లాంటి సౌకర్యం కల్పిస్తోంది. చాలా మంది ప్రయాణికులకు ఈ సదుపాయం తెలియక స్టేషన్ చుట్టుపక్కల ఉన్న హోటల్ గదుల్లో మంచి అద్దె చెల్లించి బస చేస్తున్నారు.

YS Sharmila: తన మనవడు ఏం తింటడో రంగయ్య మనవడూ అదే తినాలని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?: షర్మిల

మీ ప్రయాణ సమయంలో ఒకవేళ రైల్వే స్టేషన్‌లో ఉండవలసి వస్తే, మీకు స్టేషన్‌లోనే గది లభిస్తుంది. దీని కోసం మీరు బయట హోటల్‌కు వెళ్లి గదికి డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీకు రైల్వే స్టేషన్‌లో చాలా తక్కువ గదులు లభిస్తాయి. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు బస చేసేందుకు గదులు కూడా ఏర్పాటు చేశారు. ఇవి గదులు హోటల్ గది వలె మీకు కావలసినవన్ని అందుబాటులో ఉంటాయి. రాత్రిపూట గది బుకింగ్ ఛార్జీలు 100 రూపాయలు నుంచి 700 రూపాయలు వరకు ఉంటాయి.

రైల్వే స్టేషన్‌లో గదిని బుక్ చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది
ముందుగా IRCTC ఖాతా తెరవాలి.
ఈ లాగిన్ తర్వాత, మై బుకింగ్ ఎంపికకు వెళ్లండి.
మీ టికెట్ బుకింగ్ దిగువన ‘రిటైరింగ్ రూమ్’ కనిపిస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మీరు గదిని బుక్ చేసుకోవచ్చు.
ఇక్కడ మీరు మీ వ్యక్తిగత ప్రయాణ సమాచారాన్ని నమోదు చేయాలి.
చెల్లింపు చేసిన తర్వాత మీ గది బుక్ అవుతుంది.