Kaushik Reddy: అందుకే నకిలీ ఆడియోను వైరల్ చేస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

ఆ నకిలీ ఆడియో వల్ల ముదిరాజ్ ల మనోభావాలు దెబ్బతింటే తాను క్షమాపణ కోరుతున్నానని అన్నారు.

Padi Kaushik Reddy

Kaushik Reddy – BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల వైరల్ అయిన ఆడియోపై పలు వివరాలు తెలిపారు. తెలంగాణ (Telangana) రాష్ట్ర ముదిరాజ్ సామాజిక వర్గానికి నిజాలు తెలియాలన్నారు. తాను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు.

తాను కులాలతో సంబంధం లేకుండా రాజకీయాల్లో పనిచేస్తున్నానని అన్నారు. తనకు తన తల్లిదండ్రులు సంస్కారం నేర్పారని చెప్పారు. హుజూరాబాద్ నియోజక వర్గంలో తనకు ఆదరణ పెరుగుతోందని, అందుకే తన ఎదురుదలను ఓర్వలేక కొందరు తనపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. తాను మాట్లాడినట్లు నకిలీ ఆడియోని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

తనను ముదిరాజ్ కులస్తులకు దూరం చేయాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆ నకిలీ ఆడియో వల్ల ముదిరాజ్ ల మనోభావాలు దెబ్బతింటే తాను క్షమాపణ కోరుతున్నానని అన్నారు. ఆ ఆడియోను ఫోరెన్సిక్ కు పంపాలని తాను డీజీపీని కోరుతున్నానని అన్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

Chandrababu Naidu: ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా..? ఏపీలో వరుస దాడులపై చంద్రబాబు వీడియో రిలీజ్