×
Ad

Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాను: కవిత ప్రకటన

రేవంత్‌ రెడ్డి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అని కవితను ఒకరు ప్రశ్నించారు.

Kavitha

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక విషయాలు తెలిపారు. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ప్రస్తుత పొలిటికల్ పార్టీల మధ్య నిలదొక్కుకుంటానని అన్నారు.

ఎక్స్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానాలు చెప్పారు. “2047 నా విజన్.. ఉచిత విద్య.. ఉచిత వైద్యం.. నా విధానం” అని పేర్కొన్నారు. ఫార్మా సిటీ, ఫ్యూచర్‌ సిటీల వల్ల నష్టపోయిన రైతులను కలుస్తారా? అన్న ప్రశ్నకు కవిత స్పందిస్తూ.. త్వరలోనే కలుస్తానని తెలిపారు. (Kavitha)

రేవంత్‌ రెడ్డి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అని కవితను ఒకరు ప్రశ్నించారు. హామీలను నెరవేర్చలేదని, చేస్తామన్నవి చేయడంలో విఫలమయ్యారని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తిగా నిరాశతో ఉన్నారని అన్నారు.

ఒకరు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ రామ్ చరణ్ గ్రేట్ డ్యాన్సర్ అని తెలిపారు. తాను మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్‌ను అని అన్నారు.

“మీరు కుటుంబ రాజకీయాల నుంచి బయటకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టిన ధైర్యం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. జయలలిత ఎలా స్వతంత్ర నాయకత్వంతో ప్రజల విశ్వాసం సంపాదించారో, అలాగే మీరు కూడా ముఖ్యమంత్రి అయితే ప్రజలకు అంకితమైన బలమైన నాయకత్వం అందిస్తారని ఆశిస్తున్నాం” అని ఒకరు పేర్కొన్నారు. దీంతో కవిత స్పందిస్తూ థ్యాంక్యూ ఎమోజీని పెట్టారు.