Kavitha : సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కవిత ఫైర్.. పరువు నష్టం దావా వేస్తా..

Kavitha : సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. హైడ్రా పెట్టిన ట్వీట్స్ డిలీట్ చేయాలి.. లేకపోతే పరువు నష్టం దావా వేస్తా అంటూ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Kavitha

  • సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్‌పై కవిత ఫైర్
  • తెలంగాణలో చిన్న మోదీలా రేవంత్ వ్యవహారం ఉంది
  • హైడ్రా పెట్టిన ట్వీట్స్ డిలీట్ చేయకపోతే పరువు నష్టం దావావేస్తా

Kavitha : సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచ బ్యాంక్‌కు మూసీ పరివాహక ప్రాంత భూములను కట్టబెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని, ఇప్పటి వరకు మూసీపై డీపీఆర్ రిలీజ్ చేయడం లేదని అన్నారు. ఫేజ్-1కు సంబంధించి డీపీఆర్ ప్రభుత్వం చూపెట్టింది. పూర్తి డీపీఆర్ ఇవ్వకపోవటం వెనుక మోసం ఉందని కవిత అనుమానం వ్యక్తం చేశారు.

Also Read : Tamilnadu : తమిళనాడుపై బీజేపీ గురి.. టీవీకే విజయ్‌కు భారీ ఆఫర్? తెరపైకి పవన్ కల్యాణ్ పేరు..!

ఫ్రీ ఫీజబులిటీ రిపోర్టులో 5,641 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం చెప్పింది. ఆరు నెలల తరువాత దాదాపు 1400 కోట్ల రూపాయల అంచనా పెరిగిందన్న కవిత..  గాంధీ విగ్రహానికి ఎంత అవుతుందో అంత సీఎం ఇంటి నుంచి ఇవ్వాలని అన్నారు. మూసీ ప్రాజెక్టు ప్రజెంటేషన్‌కు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, మంత్రులను పిలిచారు. మూసీలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు అవుతున్న వారిని సీఎం ప్రజెంటేషన్ కు ఎందుకు పిలవలేదని కవిత ప్రశ్నించారు. తెలంగాణలో చిన్న మోదీలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, మూసీ పేరుతో సీఎం గ్రాఫిక్స్ చూపెట్టారని కవిత విమర్శించారు.

హైడ్రాతో సీఎం రేవంత్ రెడ్డి అరాచకం చేస్తున్నారని, హైడ్రా కమిషనర్ రంగనాధ్‌కు ఇప్పటి వరకు ఆరు ఫిర్యాదులు చేశాం. నాలాలు ఆక్రమించి విల్లాలు కడుతున్న సంస్థ మా పరిధిలోకి రాదని హైడ్రా కమిషనర్ అంటున్నారు. సిగ్గు లేకుండా రంగనాథ్, హైడ్రా వీడియోలు తీసి పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు వీడియోలు పెడుతున్నారు. కంటెంట్ రైటర్లా మీరా…? నేను ఆధారాలు బయట పెడితే హైడ్రా, ప్రభుత్వం బావిలో దూకాలి. నేను ఆధారాలు బయటపెడితే ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి నన్ను బదనాం చేస్తారా…? తమాషాలు చేస్తున్నారా? హైడ్రా పెట్టిన ట్వీట్స్ డిలీట్ చేయాలి.. లేకపోతే పరువు నష్టం దావా వేస్తా అంటూ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ప్రభుత్వం నడుస్తోందన్నారు.

ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ప్రభుత్వం ఇళ్ల పట్టాలు అసలైన భాదితులకు ఇవ్వలేదు. అందులో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చారని మా దృష్టికి వచ్చింది. త్వరలో వెలుగుమట్లలో పర్యటిస్తానని కవిత అన్నారు.