Kavitha: ఆ ముగ్గురిపైనే నా పోరాటం.. శ్రీరామనవమి తర్వాత.. కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన

ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో మా కొత్త పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆమె అంచనా వేశారు. ఉద్యమంలో పని చేసిన యువతకు అవకాశం ఇస్తామన్నారు.

  • Published On : March 19, 2026 / 04:29 PM IST

Kavitha

  • మా కొత్త పార్టీ సక్సెస్ అవుతుంది
  • నాకు ఎవరితోనూ రాజీ లేదు
  • ఉద్యమంలో పని చేసిన యువతకు అవకాశం ఇస్తాం
  • వనపర్తి నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు

 

Kavitha: జాగృతి కార్యాలయంలో చిట్ చాట్ లో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతోందన్నారు. మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తానని తెలిపారామె. గాంధీజీ సర్వోదయ సిద్దాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. డాడీ, మోడీ, చిన్న మోడీపై నా పోరాటం ఉంటుందని తేల్చి చెప్పారు. తనకు ఎవరితోనూ రాజీ లేదన్నారు.

తమ కొత్త పార్టీ సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పేరు విషయంలో అన్నీ సెట్ అవుతున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తో తన ఇష్యూను కాంగ్రెస్, సీఎం రేవంత్ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారని.. అసెంబ్లీలో సైతం కాంగ్రెస్ నేతలు తన ఇష్యూను వాడుకుంటున్నారని మండిపడ్డారు.

శ్రీరామనవమి తర్వాత కొత్త పార్టీ ప్రకటన ముందే జాతీయ స్థాయి నేతలను కలుస్తానని తెలిపారు. చాలామంది జాతీయ నేతలతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. నూతన పార్టీ కార్యాలయం కోసం ల్యాండ్ చూస్తున్నామన్నారు కవిత. తనకు బేషజాలు లేవని, అందరినీ కలుపుకుపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు కవిత చెప్పారు.

ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో మా కొత్త పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆమె అంచనా వేశారు. ఉద్యమంలో పని చేసిన యువతకు అవకాశం ఇస్తామన్నారు. దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ కాదు.. చాలాచోట్ల నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని కవిత చెప్పారు. రీసెంట్ గా.. వనపర్తి నుంచి పోటీ చేయాలని జాగృతి కార్యకర్తలు కోరారని కవిత వెల్లడించారు.

Also Read: ఈ ఏడాది బంగారం రేట్లు పెరుగుతాయా? తగ్గుతాయా..? ఉగాది పంచాంగ శ్రవణంలో ఏం చెప్పారంటే..