×
Ad

Kavitha: మా పార్టీనే కుట్ర చేసి నన్ను ఓడించింది- బీఆర్ఎస్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు

ఆ తర్వాత వద్దంటే ఎమ్మెల్సీ ఇచ్చారు. నేను ఎంపీ అడిగా, ఎమ్మెల్సీ ఇచ్చారు. అయినప్పటికీ..

Kavitha: మరోసారి బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు కవిత. బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేశారామె. మా పార్టీనే కుట్ర చేసి నన్ను ఎంపీగా ఓడించింది అని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ తనను మోసం చేసిందన్నారు. ఎంపీ అడిగితే ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్పారు. తాను వద్దన్నా కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని వెల్లడించారు. గద్వాలలో మీడియాతో మాట్లాడారు కవిత. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జాగృతి కచ్చితంగా పోటీ చేస్తుందన్నారు. రాజకీయ నాయకుడు అంటే ప్రజల మధ్యనే ఉండాలని తాను బలంగా నమ్ముతానని కవిత అన్నారు.

”వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా జాగృతి పోటీ చేస్తుంది. పేరు అదే ఉంటుందా మరొకటి ఉంటుందా అనేది సెకండరీ. 2029 లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని నేను అనుకుంటున్నా. అప్పుడు మాత్రం మేము బరిలో ఉంటాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రయారిటీ అదే ఉంటుంది. ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో జాగృతి ఉండాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి.

నేను ఎంపీ అయిన తర్వాత నా సోషల్ మీడియా ఖాతాలు చూడొచ్చు. ఎంపీ అయిన తర్వాత మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మన ఊరు మన ఎంపీ కార్యక్రమం పేరుతో నా నియోజకవర్గంలోని ప్రతి ఊరు తిరిగా. నాకు అధికారం ఉంది కదా, నేనేం తిరిగే అవసరం లేదు కదా, నేను ఆల్రెడీ ఎంపీ అయ్యాను కదా అని నేను అనుకోలేదు. ఎప్పుడైనా నేను ప్రజల మధ్యలో ఉన్నా.

ఆ తర్వాత నన్ను మా పార్టీనే కుట్ర చేసి ఎంపీగా ఓడించింది. ఆ తర్వాత కరోనా వచ్చింది. ఆ సమయంలోనూ నేను ప్రజల కోసం గట్టిగా పని చేశాను. వేలాది మంది కోసం పని చేశా. ఎక్కడెక్కడో రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని తెలంగాణకు తీసుకొచ్చా.

ఆ తర్వాత వద్దంటే ఎమ్మెల్సీ ఇచ్చారు. నేను ఎంపీ అడిగా, ఎమ్మెల్సీ ఇచ్చారు. అయినప్పటికీ నేను ప్రజల మధ్యలోనే ఉన్నా. ఇప్పుడు నాకు ఏ పదవీ లేదు. నాకు బీఆర్ఎస్ పార్టీ అండ లేదు. బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. అయినా నేను ప్రజల్లోనే ఉన్నా. మీ అందరికి బోర్ కొట్టినా నేను కంటిన్యూగా ప్రజల మధ్యలోనే ఉంటా. ఎందుకంటే.. రాజకీయ నాయకుడు అంటే ప్రజల మధ్య ఉండాలని నేను బలంగా నమ్ముతా. కాబట్టి అదే విధంగా పని చేసుకుంటూ వెళ్తున్నా. ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోంది” అని కవిత అన్నారు.

Also Read: తెలంగాణకు ద్రోహం చేసింది మీ ఇద్దరే.. సిగ్గుతో తల దించుకోవాలి- మంత్రి ఉత్తమ్ ఫైర్