Kavitha: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. ఎక్స్ లో ఆమె పెట్టిన పోస్ట్ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ కవిత ట్వీట్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్స్ లో బీఆర్ఎస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు కౌంటర్ గానే కవిత ఈ ట్వీట్ చేసి ఉంటారనే ప్రచారం జరుగుతోంది.
కర్మ హిట్స్ బ్యాక్ అని ట్వీట్ చేసిన కవిత.. అందులో ఎవరి పేరును కానీ, ఏ పార్టీ పేరును కానీ ప్రస్తావించ లేదు. ఆమె చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చకు దారితీసింది. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
జూబ్లీహిల్స్ బైపోల్స్ లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 25వేలకు పైగా ఓట్ల మెజారిటీతో నవీన్ విజయం సాధించారు.
Karma hits back !!! 🙏🙏🙏🙏
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 14, 2025