KBR Traffic Trial: హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే.. మరోసారి ట్రాఫిక్ ట్రయల్ రన్

హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్(KBR Traffic Trial) కష్టాలను తీర్చేందుకు సరికొత్త ప్రయోగానికి అధికారులు శ్రీకారం చుట్టారు.

Kbr park one way traffic trial run on sunday says joint cp joel davis

  • కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే.
  • ఆదివారం మరోసారి ట్రాఫిక్ ట్రయల్ రన్.
  • వారం రోజుల్లో పూర్తి స్థాయి అమలు.

KBR Traffic Trial: హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ (KBR) పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు సరికొత్త ప్రయోగానికి అధికారులు శ్రీకారం చుట్టారు. పార్క్ చుట్టూ వన్ వే (KBR Traffic Trial) విధానాన్ని అమలు చేయడానికి జూన్ 21 ఆదివారం మరోసారి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ వెల్లడించారు. ఈ ట్రయల్ రన్ ఉదయం నుండి రాత్రి వరకు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

Trump Meloni Spat: ట్రంప్ వర్సెస్ మెలోని.. అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు.. పచ్చి అబద్ధాలంటూ ఇటలీ ప్రధాని ఫైర్

కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రస్తుతం ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్ పాస్‌ల నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ వన్ వే నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో నిర్వహించిన మొదటి ట్రయల్ రన్‌లో ఎదురైన ట్రాఫిక్ ఇబ్బందులను డ్రోన్ విజువల్స్, ప్రయాణికులు, నిపుణుల అభిప్రాయాల ద్వారా గుర్తించారు. ముఖ్యంగా పీక్ టైమ్‌లో సమస్యలు సృష్టిస్తున్న 45 జంక్షన్లను గుర్తించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ఆదివారం జరిగే రెండో విడత ట్రయల్ రన్ విజయవంతం చేయడం కోసం దాదాపు 150 మంది ట్రాఫిక్ సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించనున్నారు. ఈ ట్రయల్ రన్ ముగిసిన తర్వాత, ఎదురయ్యే మరికొన్ని సవాళ్లను సమీక్షించుకుని.. వారం రోజుల వ్యవధిలోనే కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానాన్ని నగరంలో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని జాయింట్ సీపీ స్పష్టం చేశారు.