KCR: తెలంగాణ వ్యాప్తంగా నిరసనకు కేసీఆర్ పిలుపు

లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 రూపాయల బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని..

KCR: తెలంగాణ వ్యాప్తంగా నిరసనకు కేసీఆర్ పిలుపు

Updated On : May 15, 2024 / 9:33 PM IST

తెలంగాణ వ్యాప్త నిరసనకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టాలన్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్పారు.

లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 రూపాయల బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ఏంటని కేసీఆర్ అన్నారు. ఇది తెలంగాణ రైతాంగాన్ని మరోసారి వంచించడం, మోసం చేయడమే అవుతుందని చెప్పారు.

రైతువ్యతిరేక విధానాలను ఈ ఖండిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని అన్నారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఇటువంటి తీరును ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ముగియగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని విమర్శించారు.

సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న మాట ఎన్నికలకు ముందే చెప్పి ఉంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసేవాళ్లని కేసీఆర్ అన్నారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.