తెలంగాణ సీఎం ఢిల్లీ పర్యటన ఖారారు అయింది. శుక్రవారం(అక్టోబర్-4,2019)న కేసీఆర్ దేశ రాజధానికి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం కానున్నారు. నరేంద్రమోడీ రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయనతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. గతేడాది డిసెంబర్ లో చివరిసారిగా మోడీని కేసీఆర్ కలిశారు. దాదాపు పదినెలల తర్వాత మోడీతో కేసీఆర్ భేటీ కానున్నారు.
అయితే మోడీ ప్రమాణాస్పీకార కార్యక్రమం రోజున ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్, కేసీఆర్, అప్పటి ఉమ్మడి గవర్నర్ నరసింహనన్ కలిసి ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లాలని భావించినప్పటికీ చివరిరనిమిషంలో విమానం ల్యాండింగ్‌కు అనుమతి లేని కారణంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి గైర్హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే.