KCR: కేసీఆర్‌తో టచ్ లో కాంగ్రెస్ కీలక నేతలు.. నల్లగొండపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్

నల్లగొండపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్.. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పెద్దలకు గాలం వేస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఇప్పటికే కేసీఆర్‌తో టచ్ ఉన్నట్లు.. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

KCR reverse akarsh and focus on congress leaders

KCR reverse akarsh : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రివర్స్ ఆపరేషన్ మొదలుపెట్టారా..? ఎన్నికల ముందు ఆపరేషన్ ఆకర్ష్‌ (Operation Akarsh)తో బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేసిన కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వనున్నారా? మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారా? పార్టీలో కొత్తగా చేరికలు అవసరం లేదన్న సీఎం కేసీఆర్ (CM KCR) ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు ఎర్ర తివాచీలు పరచడానికి కారణమేంటి? తెరవెనుక (Tera Venuka) రాజకీయం ఎలా నడుస్తోంది?

తెలంగాణ ఎన్నికలు (Telangana Elections) దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల (karnataka election results) కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు వీచాయి. ఈ ఊపులో బీఆర్ఎస్ అసంతృప్త నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది కాంగ్రెస్ నాయకత్వం. ఇటీవల కాలంలో వరుసగా బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరుతుండటంతో.. ఈ తంతుకు ఫుల్‌స్టాప్ పెట్టాలని భావించారు సీఎం కేసీఆర్.. బీఆర్‌ఎస్ వలసలకు బ్రేక్ వేసి.. కాంగ్రెస్ నేతలకు వల వేయడం ద్వారా రివర్స్ అటాక్ చేస్తున్నారు కేసీఆర్. ఇందులో భాగంగానే తొలి వికెట్‌గా యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు.

ఇటీవల జోరుగా కనిపిస్తున్న కాంగ్రెస్‌కు జర్క్ ఇవ్వడమే అనిల్‌కుమార్‌కు గులాబీ తీర్థం ఇవ్వడమని చెబుతున్నా.. ముందుముందు మరిన్ని చేరికలు ఉంటాయని ప్రగతిభవన్ సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన నేతలు కాంగ్రెస్ త్వరలో ఆ పార్టీని వీడడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. సూర్యాపేటలో ఈ సారి పటేల్ రమేశ్ రెడ్డి (Patel Ramesh Reddy) కి టికెట్ ఖాయమనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నేత రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డి ((Ramreddy Damodar Reddy) అసంతృప్తితో రగిలిపోతున్నట్లు చెబుతున్నారు.

Also Read: కాంగ్రెస్ కు కౌంటర్ గా కిషన్ రెడ్డి వ్యూహాలు.. ఈ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా?

నల్లగొండ పార్లమెంట్, కోదాడ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తామని రామ్‌రెడ్డి దామోదర్‌రెడ్డికి చెబుతుంటే ఆయన మాత్రం బీఆర్‌ఎస్ వైపు ఆశగా చూస్తున్నట్లు గాంధీభవన్ టాక్. దామోదర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి వెళ్లడం దాదాపు ఖాయమనే టాక్ జోరుగా వినిపిస్తోది. ఇక అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నేతకు పార్టీలో పొమ్మనలేక పొగ పెడుతున్నారట. చాలాకాలంగా తాను కాపాడుకుంటూ వస్తున్న నియోజకవర్గాలను తనకు కాకుండా చేస్తున్నారనే ఆందోళనలో ఆ నేత ఉన్నారట. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మదన పడుతున్న ఆ నేత కూడా గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

Also Read: బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మైండ్‌గేమ్‌.. తెరవెనుక రాజకీయంలో మూడూ మూడే!

ఇలా నల్లగొండపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్.. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పెద్దలకు గాలం వేస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఇప్పటికే కేసీఆర్‌తో టచ్ ఉన్నట్లు.. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు ఆరు నెలలుగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న సదరు నేత బీఆర్ఎస్ లోకి జంపు చేయాలని భావిస్తున్నారట. అదేవిధంగా ఇదే జిల్లాకు చెందిన మరోనేత కూడా బీఆర్‌ఎస్ నేతలతో టచ్ ఉన్నట్లు చెబుతున్నారు. వీరిని పార్టీలో చేర్చుకోడానికి బీఆర్‌ఎస్ కూడా ఆసక్తిగా ఉన్నా.. సమయం కోసం వేచిచూస్తున్నట్లు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు