KCR
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింట్లోనూ ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆయన మాట్లాడారు.
“ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్. పొలాలకు నీళ్లు ఇవ్వడంలో ఫెయిల్. మంచినీళ్లు ఇవ్వడంలో ఫెయిల్. కరెంటు సరఫరాలో ఫెయిల్. రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్. పల్లెలు, పట్టణాల్లో ఫెయిల్.
విత్తనాలు, ఎరువుల సరఫరాల్లో ఫెయిల్. భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి ఎందులో పాస్? ఎట్లపడితే అట్ల ఒర్లుడులో పాస్. దేవుళ్లపై ఒట్టు పెట్టడం, అబద్ధపు వాగ్దానాలు చేసుడు, కమీషన్లు తీసుకునుడులో పాస్. సంచులు నింపులు, మోసుడులో పాస్” అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
గోల్‌మాల్ చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ లేదని కేసీఆర్ అన్నారు. ఇక్కడ ఉన్నవారు చాలరని.. ఢిల్లీ నుంచి డూప్లికేట్ గాంధీలు కూడా వచ్చి స్టేజీల మీద చప్పట్లు కొట్టి, డాన్సులు వేసి మరీ లేనిపోని హామీలు ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు హామీలు నెరవేర్చడం లేదని తెలిపారు.