Aarogyasri Services Halt: తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్..! ఎప్పటి నుంచి.. ఎందుకు అంటే..

రాష్ట్రవ్యాప్తంగా 330 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి.

Aarogyasri Services Halt: తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్..! ఎప్పటి నుంచి.. ఎందుకు అంటే..

Updated On : September 15, 2025 / 4:32 PM IST

Aarogyasri Services Halt: బకాయిలు చెల్లించకుంటే ఎల్లుండి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్లు నెట్ వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి. 12 నెలలకు సంబంధించి 1400 కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్ వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 330 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. 22 నెలలుగా EHS, JHS బకాయిలు ఇవ్వలేదని నెట్ వర్క్ ఆసుపత్రులు ఆరోపించాయి.

ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయాలని తెలంగాణకు సంబంధించిన నెట్ వర్క్ ఆసుపత్రులు పిలుపునిచ్చాయి. గత 20 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంతో నెట్ వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ముందుగా 1వ తేదీ నుంచే ఆరోగ్య శ్రీ సేవలు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆరోగ్యశాఖ మంత్రితో చర్చలు జరిపారు. ఆ చర్చల తర్వాత తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు.

ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవటం, దాదాపు 1400 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉండటం, అదే విధంగా 22 నెలలుగా ఈహెచ్ఎస్, జీహెచ్ ఎస్ సేవలకు సంబంధించిన డబ్బులు రాకపోవటం.. వీటి కారణంగా ఆసుపత్రులు నడిపించలేని పరిస్థితుల్లో మేమున్నామని, వీలైనంత త్వరగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలను విడుదల చేస్తే తప్ప ఆసుపత్రులను నడపలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ నెట్ వర్క్ ఆసుపత్రుల యాజ్యమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి.

తెలంగాణ వ్యాప్తంగా 330 వరకు ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు అన్నీ కూడా ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేసేందుకు నిర్ణయించాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.

ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని ఇదివరకే నెట్ వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. దాంతో ప్రభుత్వంతో వారితో చర్చలు జరిపింది. బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. బకాయిల అంశంపై గత 20 రోజుల నుంచి ఆరోగ్యశ్రీ సీఈవో, హెల్త్ సెకట్రరీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో.. నెట్ వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. అయినప్పటికీ ఎలా స్పందన లేదు.

బకాయిల విడుదలకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇక గతి లేని పరిస్థితుల్లోనే ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో సేవలన్నీ బంద్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటన విడుదల చేశాయి. ఎల్లుండి నుంచి ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయాలని నిర్ణయించారు. మరి ఈ రెండు రోజుల్లో ప్రభుత్వం ఏమైనా ముందుకొచ్చి చర్చలు జరిపి, బకాయిలు ఏమైనా విడుదల చేస్తుందో లేదో చూడాలి.

Also Read: గుడ్‌న్యూస్.. భారీగా అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ కసరత్తు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..?