Nagarjuna Sagar: హామీలు అమలు కోసం నాగార్జున సాగర్‌లో కేసీఆర్ పర్యటన

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైంది. రేపు(2 ఆగస్ట్ 2021) ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం గుండా బేగంపేట చేరుకుంటారు.

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైంది. రేపు(2 ఆగస్ట్ 2021) ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం గుండా బేగంపేట విమానశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా 10గంటల 40 నిమిషాల‌కు హాలియా చేరుకుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఉదయం 10గంటల 55నిమిషాలకు స్థానిక మార్కెట్‌ యార్డులో నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హిస్తారు.

మ‌ధ్యాహ్నం 1:10 నిమిషాల‌కు ఎమ్మెల్యే నోముల భ‌గ‌త్ నివాసంలో కేసీఆర్ లంచ్ చేస్తారు. అనంత‌రం 2:10 నిమిషాల‌కు హెలికాప్ట‌ర్‌లో హైద‌రాబాద్‌కు తిరుగు ప్ర‌యాణం అవుతారు. సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక సమయంలో ఉప ఎన్నిక సందర్భంగా అప్పట్లో బహిరంగ సభలో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మరోమారు పర్యటిస్తానంటూ ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. ఈ మేరకే షెడ్యూల్ ఖరారు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ కేంద్రమైన హాలియాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన సాగనుంది. సభ జరిగే పాలిటెక్నిక్‌ కాలేజ్ స్టేడియాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి ఇప్పటికే పరిశీలించారు. నాగార్జునసాగర్‌ నియోజవర్గంలో హామీల అమలు.. సమస్యలపై సర్పంచి స్థాయి నుంచి సమీక్ష జరిపి అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వస్తున్నారని ఇప్పటికే మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు