×
Ad

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు‌లో కీలక పరిణామం.. సిట్ బృందం బిగ్ డెసిషన్

Phone Tapping Case : తెలంగాణలో ఫ్యాన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద ..

Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ బృందం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తుంది. దీంతో ఆయన ఎలాంటి సమాచారం ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టిసారించింది. ఈ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించింది. పలువురు రాజకీయ ప్రముఖుల వాంగ్మూలాలను సిట్ రికార్డు చేసింది.