Khairatabad Ganesh Idol Poster : మొదటిసారి మట్టితో ఖైరతాబాద్ వినాయకుడు.. నమూనా ఇదిగో.. ఎత్తు ఎంతో తెలుసా

ఖైర‌తాబాద్‌లో ఆవిష్కరించ‌నున్న గ‌ణేశుడి ప్ర‌తిమ‌కు సంబంధించిన న‌మూనాను ఖైత‌రాబాద్ గ‌ణేశ్ ఉత్స‌వ క‌మిటీ విడుద‌ల చేసింది. తొలిసారిగా ఖైర‌తాబాద్ వినాయ‌కుడు పూర్తిగా మ‌ట్టితోనే నిర్మితం కానున్నాడు.

Khairatabad Ganesh Idol Poster : మొట్టమొదటిసారిగా పూర్తిగా మట్టితోనే నిర్మాణం. ఎత్తు 50 అడుగులు. పంచముఖ లక్ష్మీగణపతి రూపం. ఇవీ.. ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ విశేషాలు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ ఏడాది ఖైర‌తాబాద్‌లో ఆవిష్కరించ‌నున్న గ‌ణేశుడి ప్ర‌తిమ‌కు సంబంధించిన న‌మూనాను ఖైత‌రాబాద్ గ‌ణేశ్ ఉత్స‌వ క‌మిటీ సోమ‌వారం విడుద‌ల చేసింది.

ఈ ఏడాది పంచముఖ లక్ష్మీ గణపతి రూపంలో 50 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడు దర్శనం ఇవ్వనున్నాడు. ఎడ‌మ వైపున త్రిశ‌క్తి మ‌హా గాయ‌త్రి దేవి, కుడివైపున సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి రూపంతో వినాయ‌కుడి విగ్రహాన్ని తీర్చిదిద్దనున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

తొలిసారిగా ఖైర‌తాబాద్ వినాయ‌కుడు పూర్తిగా మ‌ట్టితోనే నిర్మితం కానున్నాడు. ఇప్ప‌టిదాకా ఏర్పాటైన వినాయ‌క ప్ర‌తిమ‌ల‌న్నీ ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్‌తో రూపొందిన‌వే. అయితే తొలిసారి ఖైర‌తాబాద్ గ‌ణేశుడు పూర్తిగా మ‌ట్టితోనే రూపొంద‌నున్నాడు. మ‌ట్టి గ‌ణప‌తుల వినియోగాన్ని ప్రోత్స‌హించాల‌న్న ప్ర‌భుత్వ పిలుపుతోనే ఈ ద‌ఫా మ‌ట్టి వినాయ‌కుడి ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఉత్స‌వ కమిటీ తెలిపింది.

Khairatabad Ganesh : ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవాలకు తొలిపూజ.. ఈసారి మట్టి వినాయకుడు.. ఎత్తు ఎంతంటే

జూన్ 10న కర్ర పూజతో విగ్రహ తయారీ మొదలైంది. అయితే, సమయం తక్కువగా ఉండటం, పీవోపీపై ఆంక్షలతో విగ్రహం ఎత్తు తగ్గించారు నిర్వాహకులు. నిమజ్జనానికి తరలివెళ్లేలా మట్టి విగ్రహాన్ని తయారు చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు