Khammam Additional Collector
Government Hospital : ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యలు ఉండవని… వైద్యులు సరిగా పని చేయరని ప్రజల్లో ఒక అప నమ్మకం ఏర్పడిపోయి…. కార్పోరేట్ ఆస్పత్రుల హవా పెరిగిపోయింది. ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు ఖమ్మంజిల్లా అడిషనల్ కలెక్టర్. ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ గా పని చేస్తున్న స్నేహలత 9 నెలల గర్భిణి.
ఆమెకు నిన్న పురిటి నొప్పులు రావటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి సామాన్య మహిళగా వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేయాలని సూచించారు. అందుకు ఆమె అంగీకరించటంతో వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు.
అడిషనల్ కలెక్టర్ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈవార్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ప్రతి ఒక్కరూ స్నేహలతను అభినందిస్తున్నారు. సర్కారు దవాఖానాలో డెలివరీ చేయించుకుని , అందరికీ ఆదర్శంగా నిలిచారని ….దీని వల్ల ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందని అభినందిస్తున్నారు.