Khammam : రెమ్‌డెసివర్ పేరిట మోసం..గ్లూకోజ్ వాటర్ కలిపి ఇంజక్షన్

ఓ పౌడర్ మెడిసిన్ లో గ్లూకోజ్ వాటర్ కలిపి ఇంజక్షన్ ఇస్తున్నాడో ఓ డాక్టర్. ఈ ఇంజక్షన్ తీసుకున్న తమ బంధువు చనిపోయాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ డాక్టర్ మోసం వెలుగులోకి వచ్చింది.

Khammam

Balaji Chest Private Hospital : కరోనా మహమ్మారితో ప్రజలు ఓ వైపు ఛస్తుంటే..ఇదే అదనుగా అడ్డగోలుగా దోచేస్తున్నారు కంత్రీగాళ్లు. ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. రెమ్‌డెసివర్ ఇంజక్షన్ పేరిట..ఓ డాక్టర్ మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాలో బాలాజీ ఛెస్ట్ ఆసుపత్రిలో నకిలీ ఇంజక్షన్ తో జనాలను మోసం చేసేస్తున్నారు.

ఓ పౌడర్ మెడిసిన్ లో గ్లూకోజ్ వాటర్ కలిపి ఇంజక్షన్ ఇస్తున్నాడో ఓ డాక్టర్. ఈ ఇంజక్షన్ తీసుకున్న తమ బంధువు చనిపోయాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ డాక్టర్ మోసం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ నిర్వాకం బయటపడడంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

కరోనా సెకండ్ వేవ్ లో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో రెమ్‌డెసివర్ ఇంజక్షన్ వాడకం ప్రాధాన్యత పెరిగిపోయింది. ఈ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ లోకి తరలించకుండా ఉండేందుకు అధికారులు పకడ్బంది చర్యలు తీసుకుంటున్నారు. ఉక్కుపాదం మోపుతున్నా..అక్కడకక్కడ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.

ఖమ్మంలోని బాలాజీ ఛెస్ట్ ఆసుపత్రిలో వాడి పడేసిన ఇంజక్షన్ లో పౌడర్ ను కలిపి…గ్లూకోజ్ వాటర్ కలిపి రోగులకు ఇస్తున్నాడు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Read More : GHMC Sanitize city : కరోనా కట్టడిలో జీహెచ్ఎంసీ