GHMC Sanitize city : కరోనా కట్టడిలో జీహెచ్ఎంసీ

కరోనా కట్టడిపై జీహెచ్‌ఎంసీ ఫోకస్‌ పెట్టింది. కొవిడ్ రక్షణ చర్యల్లో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్​బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. నగరాన్ని వైరస్‌ ఫ్రీగా చేసేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాయి. మరి గ్రేటర్‌ను వైరస్‌ ఫ్రీగా చేసేందుకు బల్దియా తీసుకుంటున్నా చర్యలేంటో ఒకసారి తెలుసుకుందాం..

GHMC Sanitize city : కరోనా కట్టడిలో జీహెచ్ఎంసీ

Ghmc Sanitize Entire City

GHMC Sanitize city :  కరోనా కట్టడిపై జీహెచ్‌ఎంసీ ఫోకస్‌ పెట్టింది. కొవిడ్ రక్షణ చర్యల్లో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్​బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. నగరాన్ని వైరస్‌ ఫ్రీగా చేసేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాయి. మరి గ్రేటర్‌ను వైరస్‌ ఫ్రీగా చేసేందుకు బల్దియా తీసుకుంటున్నా చర్యలేంటో ఒకసారి తెలుసుకుందాం..

బల్దియాలో కరోనా కట్టడికి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రత్యేకంగా కృషిచేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఇళ్లు, పబ్లిక్ స్థలాలు, వీధులు, ప్రధాన రోడ్లపై డిసిన్‌ఫెక్షన్ ​స్ప్రేయింగ్​ చేసే బాధ్యతను డీఆర్ఎఫ్, ఎంటమాలజీ విభాగాలు చేపడుతున్నాయి. డీఆర్ఎస్ విభాగానికి చెందిన ప్రత్యేక వాహనాలతో నగరంలోని అన్ని ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నారు సిబ్బంది. గ్రేటర్ పరిధిలో ఉన్న 30 సర్కిళ్లకు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేయడంతో పాటుగా సెంట్రలైజ్డ్‌గా మరో 15 వాహనాలు పనిచేస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే అన్ని రోడ్లకు ఇరువైపులా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు సిబ్బంది.

బల్దియా పరిధిలో ఇప్పటికే 80 శాతం స్ప్రేయింగ్​పూర్తి చేసినట్టు చెబుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రతి వాహనానికి ఒక డ్రైవర్, ఇద్దరు వర్కర్లు, ఒక సూపర్ వైజర్‌ను నియమించారు. డీఆర్ఎఫ్​ విభాగంలో ఉన్న సుమారు ఆరొందల మంది ఈ స్రేయింగ్​పనుల్లో పాల్గొంటున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ.. రాత్రి 8 నుంచి.. ఉదయం 8 వరకూ రెండు షిప్టుల్లో సిబ్బంది స్ప్రేయింగ్​ చేపడుతున్నారు.

స్ప్రేయింగ్‌లో పక్కా షెడ్యూల్ ​ప్రకారం పనిచేస్తున్నాయి డీఆర్ఎఫ్ బృందాలు. కొవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువ రావడం, మరణాలు సంభవించినపుడు స్థానిక ప్రజలు కాల్ చేస్తే అక్కడికి వెళ్లి సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నాయి. సర్కిల్ పరిధిలో డిప్యూటీ కమిషనర్, కార్పొరేటర్ సమన్వయంగా స్థానిక అవసరాల మేరకు స్పేయింగ్ చేయిస్తున్నారు.

నగరాన్ని వైరస్‌ ఫ్రీగా చేసేందుకు సోడియం హైపోక్లోరైట్ స్ప్రే పనిచేస్తోందంటున్నారు సిటిజన్స్‌. అయితే ఇంకాచాలా ప్రాంతాల్లో శానిటైజేషన్ చేయడం లేదని పలువురు జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో లక్ష్యం పూర్తవుతుందని.. ఆ తర్వాత రెండో విడత స్ప్రేయింగ్‌ చేపడతామంటున్నాయి బల్దియా వర్గాలు.