Kishan Reddy On Swapnalok Fire Accident: ఈ కారణాల వల్లే హైదరాబాద్ లో అగ్ని ప్రమాదాలు: కిషన్ రెడ్డి

స్వప్నలోక్ కాంప్లెక్స్‌ ను పరిశీలించిన అనంతరం కిషన్ రెడ్డి దానిపై మాట్లాడారు. ప్రమాదాలకు కారకులైన వారిపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. ప్రమాదాలకు కారణం జీహెచ్‌ఎంసీ తప్పుడు నిర్ణయాలేనని విమర్శించారు. గోదాములు, తుక్కు వంటి దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీ చేయట్లేదని ఆయన అన్నారు. అంతేగాక, ప్రమాదాల నివారణకు కూడా తగిన సామగ్రి అందుబాటులో లేదని విమర్శించారు.

Kishan Reddy On Swapnalok Fire Accident

Swapnalok Fire Accident: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌ ను ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌ లో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించి ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో వరుసగా అగ్ని ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్‌ ను పరిశీలించిన అనంతరం కిషన్ రెడ్డి దానిపై మాట్లాడారు.

ప్రమాదాలకు కారకులైన వారిపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. ప్రమాదాలకు కారణం జీహెచ్‌ఎంసీ తప్పుడు నిర్ణయాలేనని విమర్శించారు. గోదాములు, తుక్కు వంటి దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీ చేయట్లేదని ఆయన అన్నారు. అంతేగాక, ప్రమాదాల నివారణకు కూడా తగిన సామగ్రి అందుబాటులో లేదని విమర్శించారు.

అగ్ని మాపక సిబ్బందికి కావాల్సిన కొత్త పరికాలను అందించాలని కిషన్ రెడ్డి అన్నారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గోదాములను శివారు ప్రాంతాలకు తరలించాలని అన్నారు. తమ వద్ద సిబ్బంది తక్కువగా ఉన్నట్లు అగ్ని మాపక సిబ్బంది చెబుతున్నారని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడానికి అక్రమ భవనాలను క్రమబద్ధీకరిస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. అలాగే, డబ్బులు తీసుకుని ఉపాధి కల్పిస్తున్న సంస్థలపై దృష్టి సారించాలన్నారు. ఏ సంస్థలయినా డబ్బులు అడిగితే తమకు అందుకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని కోరారు.

Ramgopal Reddy-MLC Elections 2023: ఉత్కంఠకు తెర.. రాంగోపాల్ రెడ్డికి కలెక్టర్ డిక్లరేషన్ అందజేత