ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం, అమీర్ అలీఖాన్

వారిద్దరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. 

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, సీనియర్ జర్నలిస్టు అమీర్‌ అలీఖాన్‌తో మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇవాళ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్‌ కోటాలో కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ బాధ్యతలు చేపట్టారు.

అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. తనకు ఈ పదవి రావవడంతో తెలంగాణ ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని, రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ పదవిని తాను అదనపు బాధ్యతగానే భావిస్తున్నాని, ఉద్యమకారులు ఆకాంక్షల మేరకు పని చేస్తానని చెప్పారు.

కాగా, ఈ ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాలపై కొన్ని నెలల క్రితం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బుధవారం సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఆయా స్థానాల్లో కొత్తవారి నియామకాలను ఆపలేమని చెప్పింది. దీంతో ఇవాళ కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారిద్దరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

Also Read: రేవంత్ రెడ్డి ఖమ్మంలో మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉంది: ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి

ట్రెండింగ్ వార్తలు