Kokapet Lands : వామ్మో.. ఎకరం రూ.72 కోట్లు..! రికార్డు ధర పలుకుతున్న కోకాపేట భూములు

హైదరాబాద్ లో ఉండే భూములకు ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది అనే దానికి ఇది నిదర్శనంగా చూడొచ్చు. Kokapet Lands

Kokapet Lands

Kokapet Lands Rates : కోకాపేట భూములు అంచనాలకు మించి ధర పలుకుతున్నాయి. వేలంలో ఎకరానికి అత్యధికంగా రూ.72 కోట్ల రేటు పలికిందని తెలుస్తోంది. ప్లాట్ నెంబర్ 9లో ఎకరానికి రూ.72కోట్లు పలికిందని సమాచారం. మిగిలిన ప్లాట్లకు ఎకరానికి రూ.50 కోట్ల వరకు రేటు దక్కినట్లు తెలుస్తోంది. వేలం జరుగుతున్న వారికి భారీగా ధర పలికే అవకాశం ఉంది.

హైదరాబాద్ లో ఉండే భూములకు ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది అనే దానికి ఇది నిదర్శనంగా చూడొచ్చు. నియోపొలిస్‌ లేఔట్ లో ఉండే ఏడు ప్లాట్లకు వేలం పాట నిర్వహించారు. 4 ప్లాట్లకు వేలం పాట పూర్తైంది. ఇందులో 9వ నెంబర్ ప్లాట్ కి సంబంధించి దాదాపు 3 ఎకరాల వరకు ఈ ప్లాట్ ఉంది. ఈ ప్లాట్ మెయిన్ సెంటర్ గా ఉంది. దాంతో ఎక్కువ ధర పలికినట్లు తెలుస్తోంది. ఎకరం రూ.72కోట్లు పలికినట్లు సమాచారం. మిగతా ప్లాట్ల విషయానికి వస్తే రూ.50కోట్లకు పైగా ధర పలికినట్లు తెలుస్తోంది.

Also Read..Laptop Imports: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల దిగుమతిపై నిషేధం.. కారణం ఏంటో తెలుసా?

కాసేపటి క్రితమే 2వ వేలం పాట ప్రారంభమైంది. 10, 11, 14 ప్లాట్లకు సంబంధించి వేలం పాట మొదలైంది. బిడ్డర్ల పోటీ పెరిగితే వేలం సమయం, ఆ ప్లాట్ల ధర మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో ఎకరం ధర 60 కోట్ల రూపాయల వరకు పలికింది. ఈసారి తక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్ కొంత ఎక్కువ ధర పలికింది. సరాసరిగా చూసుకున్నప్పుడు గతేడాది అత్యధికంగా ఎకరం ధర రూ.60 కోట్లు, మినిమమ్ ధర రూ.30 కోట్లు పలకగా, ఈసారి అంతకు మించి ధర వస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.

Also Read..Mobile Charger : గుండెలు పిండే తీవ్ర విషాదం.. ఫోన్ ఛార్జర్ పిన్ నోట్లో పెట్టుకుని 8నెలల చిన్నారి మృతి, తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్

ట్రెండింగ్ వార్తలు