Komatireddy : కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రాజగోపాల్ రెడ్డితోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy : ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ నేత కోమటిరెడి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. రాజగోపాల్ రెడ్డితోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు.

వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ ఆయన మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. శుక్రవారం వీరు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసే అవకాశం ఉంది.

Also Read : పొన్నాలకు రాహుల్ గాంధీ బంపర్ ఆఫర్..!

ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో నేతల అభ్యర్థిత్వాలను పరిశీలించాలంటే పార్టీలో చేరిక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉదయం 9 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో వీరు భేటీ కానున్నారు.