Komatireddy Rajgopal Reddy
Congress Party MLA : కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ సమావేశాల తరువాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చిట్ చాట్ లో రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మంత్రి పదవిపై తనకు అధిష్టానం హామీ ఇచ్చిందని, హోంశాఖ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కేసీఆర్ ను గద్దె దించడానికి కాంగ్రెస్ లోకి వచ్చానని, తాను హోంమంత్రి అయితేనే వాళ్లు కంట్రోల్ లో ఉంటారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని చెప్పిన ఆయన.. కేసీఆర్ కు బీజేపీ శ్రీరామ రక్ష అని చెప్పారు. కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు.