Congress: ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవరూ ఆపలేరు.. రాహుల్‌తో మరో సమావేశం ఉంటుంది: కోమటిరెడ్డి, జానారెడ్డి, సీతక్క

తెలంగాణలో కాంగ్రెస్‌కు పునర్‌వైభవం వస్తుందని జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో భారీగా చేరికలపై..

Komatireddy Venkat Reddy, Jana Reddy, Seethakka

Congress – Telangana: ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవరూ ఆపలేరని, తమ పార్టీలో భారీగా చేరికలు జరుగుతుండడం సంతోషకరమని టీపీసీసీ నేతలు అన్నారు. రేపు రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో స్ట్రాటజీ సమావేశం ఉంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) రెండూ ఒకటేనని అన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. కేసీఆర్ మహారాష్ట్ర వెళ్లినా కేవలం కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు చేస్తున్నారని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌కు పునర్‌వైభవం వస్తుందని జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో భారీగా చేరికలపై సంతృప్తిగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. రోజురోజుకూ కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందని చెప్పారు. అందరూ కలిసి కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు.

కాగా, జూలై 2వ తేదీన ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను టీపీసీసీ నేతలు ఆహ్వానించారు. కాంగ్రెస్ నేతలు అందరూ మళ్లీ సొంత పార్టీలోకి రావడం పట్ల రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఘర్ వాపసీ జరుగుతుందని చెప్పారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ముందుకు సాగాలని రాహుల్ అన్నారు.

Eatala Rajender : రేపు ఈటల రాజేందర్ దంపతుల ప్రెస్‌మీట్.. ఏం ప్రకటన చేస్తారోనని తీవ్ర ఉత్కంఠ