Konda Murali: కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కూతురి కామెంట్స్‌తో సంబంధం లేదు.. కొండా మురళి షాకింగ్ కామెంట్స్

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో తాజా పరిణామాల వేళ సీనియర్ నేత కొండా మురళి (Konda Murali)కీలక వ్యాఖ్యలు చేశారు.

Konda murali meet bhatti vikramarka over konda surekha issue

  • కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు
  • అధిష్ఠానం నిర్ణయానికే కట్టుబడి ఉంటాం
  • కుమార్తె చేసిన వ్యాఖ్యలతో సంబంధంలేదని వెల్లడి

Konda Murali: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఉత్పన్నమైన తాజా పరిణామాల వేళ మంత్రి కొండా సురేఖ భర్త, సీనియర్ నేత కొండా మురళి(Konda Murali) కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని, పార్టీ వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలతో కొండా మురళి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్య నేతల మధ్య జరిగిన ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.

DK Shivakumar: ‘వందేమాతరం’ రెండు చరణాలే పాడతాం.. డీకే శివకుమార్ సంచలన ప్రకటన

రాహుల్, సోనియా నేతృత్వంపై సంపూర్ణ విశ్వాసం:

సమావేశం అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానంపై తమకు పూర్త్తి విశ్వాసం ఉందని వెల్లడించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల నాయకత్వంలోనే తాము ముందుకు సాగుతామని చెప్పారు. తమ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె ప్లాన్-ఎ ప్రకారమే మాట్లాడిందని పేర్కొన్నారు. అయితే ప్లాన్-బి ఏమిటనేది తనకు తెలియదని వ్యాఖ్యానించడం గమనార్హం.

క్రమశిక్షణ కమిటీ నిర్ణయంపైనే మా దృష్టి:

ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ తన అధికారిక కార్యక్రమాల్లో బిజీగా పాల్గొంటున్నారని మురళి తెలిపారు. మంగళవారం వనమహోత్సవంలో పాల్గొన్న ఆమె, బుధవారం కూడా పలు ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యారని వివరించారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఈ అంశంపై తాను మరేమీ మాట్లాడబోనని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన తేల్చి చెప్పారు.