Konda Surekha : మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. అటవీ శాఖలో డిప్యూటేషన్లకు సడన్ బ్రేక్!
Konda Surekha : తెలంగాణ అటవీ శాఖలో 20 మందికి పైగా అధికారుల డిప్యూటేషన్లు రద్దు అయింది. సీఎంఓ జోక్యం, మంత్రి కొండా సురేఖకు సమాచారం లేకపోవడంపై సచివాలయంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
- Sreehari A
- Published on- August 24, 2026 / 07:17 PM IST
Konda Surekha CM Revanth Reddy
- సురేఖ శాఖలో అధికారుల రివర్సన్
- 20 మందికి పైగా అధికారులకు స్థానచలనం
- మంత్రి దృష్టికి రాకుండానే నిర్ణయం?
- సురేఖ పేషీకీ సమాచారం లేకుండా ఉత్తర్వులు
Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. అటవీ శాఖలో ఇటీవల చేపట్టిన పలువురు అధికారుల డిప్యూటేషన్లను ప్రభుత్వం ఒక్కసారిగా రద్దు చేసింది. దాంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల వివిధ ప్రాంతాలు, విభాగాలకు డిప్యూటేషన్‌పై వెళ్లిన 20 మందికిపైగా అధికారులను తిరిగి వారి పాత స్థానాలకు పంపుతూ అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అయితే, ఈ నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) జోక్యం ఉందనే ప్రచారం సచివాలయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సాధారణంగా శాఖకు సంబంధించిన కీలక పరిపాలనా నిర్ణయాలు, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తారు. ఆ మంత్రి ఆమోదంతోనే ముందుకు సాగడం ఆనవాయితీ. కానీ, ఈసారి మాత్రం మంత్రి కొండా సురేఖకు, ఆమె పేషీకి ముందస్తు సమాచారం అందకుండగానే డిప్యూటేషన్ల రద్దు ప్రక్రియ పూర్తయిందనే చర్చ నడుస్తోంది.
Read Also : CM Revanth Reddy : పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు.. కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఇప్పటికే అటవీ శాఖలో అధికారుల డిప్యూటేషన్ల విషయంలో పలు స్థాయిల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా అధికారుల రివర్సన్ ఆదేశాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సీఎంఓ స్థాయిలో జరిగిన జోక్యం కారణంగానే ఈ మార్పు జరిగిందా? లేదా పరిపాలనా కారణాలతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా?
అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో హీట్ పెంచుతున్నాయి. మంత్రి శాఖలో తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి అన్నది మాత్రం అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. అయితే డిప్యూటేషన్ల రద్దు వ్యవహారం తెలంగాణ సచివాలయంలో మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.
