Konda Surekha Meeting: కొండా దంపతుల సంచలన సమావేశం.. అనంతరం ఢిల్లీకి సురేఖ.. పర్యటనపై ఉత్కంఠ, కేబినెట్ స్థాయి పదవి?

కొండా సురేఖ(Konda Surekha Meeting), కొండా మురళీ ముఖ్య కార్యకర్తలు, అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది.

konda Surekha konda murali warangal meeting after cabinet removal delhi tour

  • కొండా సురేఖ అత్యవసర సమావేశం
  • బర్తరఫ్ తర్వాత తొలి భేటీ
  • ఢిల్లీ వెళ్లనున్న కొండా దంపతులు

Konda Surekha Meeting: వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయంలో సంచలన పరిణామాలు వేగంగా మారుతుండటంతో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటీవలే కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి కొండా సురేఖ(Konda Surekha Meeting), ఆమె భర్త కొండా మురళీ తమ భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. బర్తరఫ్ తర్వాత తొలిసారిగా ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ముఖ్య కార్యకర్తలు, అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది.

TGSRTC: పండుగ వేళ ప్రయాణికులకు భారీ షాక్.. చార్జీలు పెంచిన TGSRTC.. ఏకంగా 50 శాతం

వర్షం కారణంగా సమావేశ వేదిక మార్పు:

తొలుత హనుమకొండ రాంనగర్‌లోని కొండా సురేఖ నివాసంలోనే ఈ భేటీ జరగాల్సి ఉంది. అయితే వరంగల్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా, కార్యకర్తల సౌకర్యార్థం సమావేశ వేదికను స్థానిక హోటల్‌కు అత్యవసరంగా మార్చారు. ప్రతికూల వాతావరణంలోనూ కొండా అనుచరులు, నేతలు భారీగా హాజరై తమ మద్దతు తెలిపారు.

హైకమాండ్ బుజ్జగింపులు.. ఢిల్లీ పయనం:

ఈ భేటీలో కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం కొండా సురేఖ అనంతరం నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెను బుజ్జగించే పనిలో పడిందని, త్వరలోనే కేబినెట్ స్థాయి కలిగిన ముఖ్య పదవిని కేటాయించే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్ఠానంతో జరిగే చర్చల తర్వాతే తమ తదుపరి అడుగుపై స్పష్టత ఇస్తామని కొండా ఫ్యామిలీ వర్గాలు వెల్లడించాయి.