Konda Susmita: పరకాల బరిలో దిగేది నేనే.. సీఎం అయితే కళ్లు నెత్తికెక్కినయా.. కొండా సుస్మిత సంచలన కామెంట్స్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత (Konda Susmita)సంచలన కామెంట్స్ చేశారు.

Konda Sushmitha challenges CM Revanth Reddy.

  • కొండా సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు
  • సీఎం రేవంత్‌కు బహిరంగ సవాల్
  • కాంగ్రెస్ వర్గాల్లో పెరిగిన వేడి

Konda Susmita: తెలంగాణ రాజకీయం ప్రస్తుతం తీవ్ర సంచలన వ్యాఖ్యలు, విభేదాలతో వేడెక్కింది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖ-కొండా మురళిల కుమార్తె కొండా సుస్మిత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా, అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడిన సుస్మిత(Konda Susmita), ముఖ్యమంత్రి వైఖరిని నేరుగా నిలదీస్తూ ఘాటైన ప్రశ్నలు గుప్పించారు. తమ కుటుంబం అందించిన మద్దతును మర్చిపోయి, బీసీ నాయకులను తక్కువ చేసి చూస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కలకలం రేపాయి.

CM Vijay : తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యేలతోపాటు వారందరికీ శుభవార్త..

బీసీ నేతలకు అన్యాయం, స్థానిక సమీకరణాలు:

ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత మద్దతుదారులను పక్కన పెట్టారని కొండా సుస్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కొండా మురళికి ఎమ్మెల్సీ సీటు ఇస్తానని చెప్పి మాట తప్పారని, బీసీ నాయకులంటే రేవంత్ రెడ్డికి చులకన భావం ఉందని ఆరోపించారు. పరకాల నియోజకవర్గ ప్రజలకు అసలు తెలియని రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించాలని కోరడంపై మండిపడుతూ, కొండా ఫ్యామిలీ బ్రాండ్, వారి మద్దతు వల్లే రేవూరి గెలిచారని స్పష్టం చేశారు. “మైసమ్మ మీద ఒట్టు వేసి చెప్పండి, కొండా మురళి మద్దతు లేకపోతే ఆ గెలుపు సాధ్యమయ్యేదా?” అని సవాలు విసిరారు.

రాజీనామా సవాల్, పాత కాంగ్రెస్ వాదుల ఆవేదన:

తనకు చావు భయం లేదని, తండ్రి కొండా మురళి ధైర్యంగా పెంచారని పేర్కొన్న సుస్మిత, రేవంత్ రెడ్డి ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలని బహిరంగంగా సవాలు చేశారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని చెబుతున్న రేవంత్, కాంగ్రెస్ కోసం మొదటి నుండి పనిచేసిన వారిని పక్కన పెట్టి, టీడీపీ నుండి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. స్వచ్ఛమైన కాంగ్రెస్ నాయకులను సవతి తల్లి చూస్తున్నారంటూ, ప్రస్తుతం అధికారంలో ఉన్న పొగరు ఎక్కువ రోజులు నిలవదని తీవ్ర పదజాలంతో ముఖ్యమంత్రి తీరును ఖండించారు.