Konda Vishweshwar Reddy
Konda Vishweshwar Reddy: బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గుండెకు ఆపరేషన్ చేయించుకున్నారు. అంతకుముందు ఆయన ఎక్స్‌లో పలు విషయాలు తెలిపారు.
“నేను ఒక పర్సనల్ విషయం గురించి మాట్లాడుతున్నాను. నేను బేగంబజార్‌లో పెరిగాను. బస్తీలో చిన్నప్పుడు పిల్లలతో ఆడుకునేవాడిని. అప్పుడు నాకో ఇన్ఫెక్షన్ వచ్చింది. రుమాటిక్ ఫీవర్ అంటారు.
దాని ప్రభావం ముఖ్యంగా మోకాళ్లు, గుండె మీద పడుతుంది. ట్రీట్మెంట్ తీసుకున్నాను.. బాగానే ఉండేది. 30-40 ఏళ్ల నుంచి గుండె చెకప్ చేయించుకుంటున్నాను. డాక్టర్లు జాగ్రత్తలు చెప్పేవారు. రెండేళ్ల క్రితం చేస్తే గుండె బాగానే ఉంది.
బాగోలేకపోతే గుండెలో వాల్వ్ లీక్ అవుతుంది. రెండు వారాల క్రితం ప్రాబ్లం ఉందని తేలింది. ఇప్పుడు సర్జరీ చేయించుకుంటున్నాను. పార్లమెంటు ఎన్నికలలోపు కోలుకోవచ్చని సర్జరీ చేయించుకుంటున్నాను. గుండె ఆపరేషన్ అయినప్పటికీ ఫికర్ పడే అవసరం లేదు. మూడు రోజులు ఆసుపత్రిలో ఉంటాను. సర్జరీ జరిగాక మళ్లీ ట్వీట్ చేస్తాను” అని చెప్పారు.
కాగా, నిన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరో ట్వీట్ చేశారు. ఉదయం 9 గంటల సమయంలో ఏఆర్టిక్ వాల్వ్ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంటున్నానని అన్నారు. శరీరాన్ని కోయకుండా (టావి విధానానికి బదులుగా) వాల్వ్ మార్చే పద్ధతిలో ఆపరేషన్ చేస్తున్నారని తెలిపారు. తాను శారీరకంగా బలంగా ఉండడంతో ఈ పద్ధతిలో వాల్వ్ మార్చుతున్నారని అన్నారు.
“ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఆపరేషన్ తర్వాత నేను 5 -10 ఏళ్లు వయసు తగ్గినంత ఎనర్జీతో వస్తాను. వచ్చే పార్లమెంట్ సమావేశానికి ముందు పూర్తిగా కోలుకోవాలనుకుంటున్నాను. నా టీమ్ శస్త్రచికిత్స తర్వాతి విషయాన్ని తెలియజేస్తుంది. నేను కోలుకునే సమయంలో నా కార్యాలయం పనిచేస్తూనే ఉంటుంది. 040 23301959 లేదా 040 23301960” అని అన్నారు.